- Telugu News Photo Gallery Eating these foods will help you sleep better, check here is details in Telugu
Foods for Sleep: ఈ ఆహారాలు తిన్నారంటే.. నిద్ర చక్కగా పడుతుంది..
ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొందరు కావాలనే నిద్రను చెడగొట్టుకుని ఫోన్లు, టీవీలు, ల్యాప్ ట్యాప్స్ చూస్తుంటే.. మరికొందరికి ఒత్తిడి కారణంగా నిద్ర రావడం లేదు. ఇలా అనేక సమస్యలతో నిద్ర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నిద్ర చక్కగా పట్టేందుకు ఈ ఆహారాలు చక్కగా హెల్ప్ చేస్తాయి. అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండ్లు తింటే.. శరీరంలోని కండరాలు రిలాక్స్ అయి నిద్ర..
Updated on: May 04, 2024 | 2:21 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొందరు కావాలనే నిద్రను చెడగొట్టుకుని ఫోన్లు, టీవీలు, ల్యాప్ ట్యాప్స్ చూస్తుంటే.. మరికొందరికి ఒత్తిడి కారణంగా నిద్ర రావడం లేదు. ఇలా అనేక సమస్యలతో నిద్ర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

నిద్ర చక్కగా పట్టేందుకు ఈ ఆహారాలు చక్కగా హెల్ప్ చేస్తాయి. అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండ్లు తింటే.. శరీరంలోని కండరాలు రిలాక్స్ అయి నిద్ర చక్కగా పడుతుంది.

చెర్రీ పండ్లలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఈ పండ్లలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ కూడా పెరుగుతుంది. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. బాదాంలో కూడా నిద్రని రప్పించే గుణాలు ఉన్నాయి. కాబట్టి ఇది తిన్నా నిద్ర పడుతుంది.

పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మీరు హాయిగా నిద్రపోవడానికి హెల్ప్ చేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు గ్లాస్ పాలలో కొద్దిగా పసుపు కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే.. మంచి నిద్ర వస్తుంది. పెరుగు తినడం వల్ల కూడా రాత్రి పూట హాయిగా పడుకోవచ్చు.

ఓట్స్‌లో కూడా మెలటోనిన్ సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల కూడా నిద్ర పడుతుంది. అదే విధంగా కివి ఫ్రూట్‌లో సెరోటోనిన్, ఫోలేట్‌లు ఉంటాయి. ఈ పండ్లు తిన్నా కూడా బాగా నిద్ర పడుతుంది.




