10 ఏళ్ల వయసులో ఆస్పత్రిలో జాయిన్.. 62 ఏళ్ల వయసులో డిశ్చార్జ్.. రీజన్ తెలిస్తే షాక్

ఎవరైనా ఏదైనా తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంటే అతను నెలల తరబడి వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుంది. అయితే ఓ వ్యక్తి ఎటువంటి అనారోగ్యం లేకున్నా ఆసుపత్రిలో మూసి తలుపుల వెనుక దాదాపు 50 సంవత్సరాలకు పైగా గడిపి వార్తల్లో నిలిచాడు. దీని వెనుక కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తి పేరు చార్లెస్ ఎస్లర్. BBC నివేదిక ప్రకారం చార్లెస్‌ను 10 సంవత్సరాల వయస్సులో 'అభ్యాస వైకల్యం', (నాడీ సంబంధిత రుగ్మత) మూర్ఛ కారణంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇప్పుడు చార్లెస్ వయస్సు 62 సంవత్సరాలు.

10 ఏళ్ల వయసులో ఆస్పత్రిలో జాయిన్.. 62 ఏళ్ల వయసులో డిశ్చార్జ్.. రీజన్ తెలిస్తే షాక్
Charles EslerImage Credit source: BBC
Follow us

|

Updated on: May 04, 2024 | 12:14 PM

ఎవరైనా సరే పొరపాటున కూడా ఆసుపత్రిలో ఉండాలని కోరుకోరు.. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు లేదా మరేదైనా కారణంతోనైనా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే తీవ్రమైన సమస్య లేదు ఆరోగ్యం బాగుంది అనుకున్న వెంటనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. అయితే ఎవరైనా ఏదైనా తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంటే అతను నెలల తరబడి వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుంది. అయితే ఓ వ్యక్తి ఎటువంటి అనారోగ్యం లేకున్నా ఆసుపత్రిలో మూసి తలుపుల వెనుక దాదాపు 50 సంవత్సరాలకు పైగా గడిపి వార్తల్లో నిలిచాడు. దీని వెనుక కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.

ఈ వ్యక్తి పేరు చార్లెస్ ఎస్లర్. BBC నివేదిక ప్రకారం చార్లెస్‌ను 10 సంవత్సరాల వయస్సులో ‘అభ్యాస వైకల్యం’, (నాడీ సంబంధిత రుగ్మత) మూర్ఛ కారణంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇప్పుడు చార్లెస్ వయస్సు 62 సంవత్సరాలు. చివరకు చార్లెస్‌ తన 62వ ఏట ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. చాలా ఏళ్లు హాస్పిటల్ బెడ్‌పైనే గడిపానని.. అక్కడి నుంచి బయటకు రాలేదని, అయితే ఈ జీవితం తనకు అస్సలు ఇష్టం లేదని చెప్పాడు.

62 ఏళ్ల వయసులో బయటకు వచ్చిన చార్లెస్‌

ఛార్లెస్ సోదరి మార్గో మాట్లాడుతూ తన సోదరుడిని ఆసుపత్రి నుంచి బయటకు తీసుకురావడానికి తాను చాలా కష్టపడ్డానని.. ఫలితంగా 62 ఏళ్ల వయస్సులో చార్లెస్ మొదటిసారిగా తన సొంత ఫ్లాట్‌ తాళాలు తీసుకున్నాడని చెప్పారు. గ్లాస్గోలో పెరిగిన చార్లెస్.. ఇప్పుడు తాను బయటకు వెళ్లి.. ఎక్కడికైనా వెళ్లగలనని చెబుతున్నాడు. తాను రోడ్డు పక్కన ఉన్న పబ్‌కి వెళ్లి భోజనం చేస్తానని సంతోషంగా చెబుతున్నాడు. తనకు  చేపలు, చిప్స్ అంటే ఇష్టమని అవి తింటానని చెప్పాడు. చార్లెస్‌. ఇలా బయటకు రావడం చాలా బాగుంది, ఎందుకంటే తనకు ఇంతకు ముందు ఎప్పుడూ స్వేచ్ఛ లేదని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

చిన్నతనంలోనే ఆసుపత్రిలో చేరిన చార్లెస్‌

నివేదికల ప్రకారం చార్లెస్ తన లాంజ్‌లో కూర్చుని జేమ్స్ బాండ్ సినిమాలను చూడటానికి ఇష్టపడతాడని చెప్పాడు. తనకోసం తాను వంట చేసుకోవడం, తోటపని చేయడం, శుభ్రం చేయడం నేర్చుకుంటున్నాని పేర్కొన్నాడు. మార్గో మాట్లాడుతూ తన సోదరుడు చిన్నతనంలో అతని ప్రవర్తన తరచుగా ఇబ్బందిగా ఉండేదని.. దీంతో తన తల్లిదండ్రులకు చార్లెస్‌ ను ఆసుపత్రిలో చేర్చమని సలహా చెప్పేవారని గుర్తు చేసుకుంది.

పెరిగిన చార్లెస్ లాంటి రోగుల సంఖ్య

అయితే ఇన్నేళ్లు ఆసుపత్రిలో గడిపిన ఏకైక వ్యక్తి చార్లెస్ కాదు.. BBC స్కాట్లాండ్ నివేదిక ప్రకారం, అభ్యాస వైకల్యం ఉన్న వందలాది మంది ఇప్పటికీ ఆసుపత్రుల్లో నివసిస్తున్నారు. తమ కుటుంబానికి వందల మైళ్ల దూరంలో జీవితాన్ని గడిపేస్తున్నారు. ఆసుపత్రిలో ఇలాంటి రోగుల సంఖ్య పెరిగినట్లు కొత్త గణాంకాలు చెబుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
ఇంత మంచి బిజినెస్‌ ప్లాన్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.? ఇంట్లో ఉంటూనే
ఇంత మంచి బిజినెస్‌ ప్లాన్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.? ఇంట్లో ఉంటూనే
పోలింగ్ అల్లర్లపై నివేదికకు సిట్ ఏర్పాటు.. వీరిపై ఈసీ కఠిన చర్యలు
పోలింగ్ అల్లర్లపై నివేదికకు సిట్ ఏర్పాటు.. వీరిపై ఈసీ కఠిన చర్యలు
కనుమరుగైన పూజా హెగ్డే.. బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టేనా ??
కనుమరుగైన పూజా హెగ్డే.. బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టేనా ??
అలా.. సోమశిలా. తక్కువ బడ్జెట్‌లో రెండు రోజుల టూర్‌ ప్యాకేజీ..
అలా.. సోమశిలా. తక్కువ బడ్జెట్‌లో రెండు రోజుల టూర్‌ ప్యాకేజీ..
సినిమాల్లేక శ్రీలీల కష్టాలు.. ఆ పనులతో తెగ బిజీబిజీ.!
సినిమాల్లేక శ్రీలీల కష్టాలు.. ఆ పనులతో తెగ బిజీబిజీ.!
వర్షంతో 5 ఓవర్ల మ్యాచ్ జరిగితే.. ఆర్‌సీబీ టార్గెట్ ఎలా ఉందంటే?
వర్షంతో 5 ఓవర్ల మ్యాచ్ జరిగితే.. ఆర్‌సీబీ టార్గెట్ ఎలా ఉందంటే?