రామాయణ ఇతిహాసాలను చూడాలనుకుంటున్నారా.. హైదరాబాద్ నుంచి శ్రీలంకకు IRCTC తక్కువ ధరకే అందిస్తోన్న ప్యాకేజ్

మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సుందరమైన ప్రకృతి దృశ్యాలను వీక్షిస్తూ.. ఒక ప్రత్యేకమైన సంస్కృతిని చూడాలనుకునే  వారికి సరైన సెలవు గమ్యస్థానం. తెలుగువారి కోసం IRCTC శ్రీ రామాయణ యాత్ర పేరుతో ఓ టూర్ ప్యాకేజీని అందొస్తోంది. హైదరాబాద్ నుంచి కొలంబో టూర్ ప్యాకేజీ జూన్ 1 వ తేదీ న మొదలు కానుంది. నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు కొనసాగే ఈ  శ్రీ రామాయణ యాత్రలో శ్రీ లంకలోని హిందూ దేవాలయాలు,  రామాయణ పురాణ గాథతో అనుబంధించబడిన ప్రదేశాలను సందర్శించవచ్చు.  

రామాయణ ఇతిహాసాలను చూడాలనుకుంటున్నారా.. హైదరాబాద్ నుంచి శ్రీలంకకు IRCTC తక్కువ ధరకే అందిస్తోన్న ప్యాకేజ్
Sri Lanka Ramayana Tour
Follow us
Surya Kala

|

Updated on: May 04, 2024 | 11:51 AM

భారత దేశానికి శ్రీలంకకు ఉన్న ఆధ్యాత్మిక సంబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. రామాయణ కాలం నాటి పురాతన చరిత్ర కలిగిన పురాతన ద్వీప దేశం శ్రీలంక. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సుందరమైన ప్రకృతి దృశ్యాలను వీక్షిస్తూ.. ఒక ప్రత్యేకమైన సంస్కృతిని చూడాలనుకునే  వారికి సరైన సెలవు గమ్యస్థానం. తెలుగువారి కోసం IRCTC శ్రీ రామాయణ యాత్ర పేరుతో ఓ టూర్ ప్యాకేజీని అందొస్తోంది. హైదరాబాద్ నుంచి కొలంబో టూర్ ప్యాకేజీ జూన్ 1 వ తేదీ న మొదలు కానుంది. నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు కొనసాగే ఈ  శ్రీ రామాయణ యాత్రలో శ్రీ లంకలోని హిందూ దేవాలయాలు,  రామాయణ పురాణ గాథతో అనుబంధించబడిన ప్రదేశాలను సందర్శించవచ్చు.

శ్రీ రామాయణ యాత్ర టూర్ మిమ్మల్ని శ్రీలంకలోని సహజ అద్భుతాలు, పవిత్ర దేవాలయాలు, ప్రకృతి అందాలు, సందడిగా ఉండే నగరాలకు తీసుకెళ్తుంది. ఈ టూర్ ప్యాకేజీ 3-స్టార్ హోటళ్లలో వసతి, పూర్తి భోజన సదుపాయాలు, AC బస్సులో రవాణా సదుపాయం  విహారయాత్రలో ప్రొఫెషనల్ ఇంగ్లీష్ మాట్లాడే టూర్ గైడ్‌తో సహా అన్ని సౌకర్యాలు, అవసరాలను ఈ ప్యాకేజీ కవర్ చేస్తోంది.

ప్రయోజనాలు ఏమిటఁటే

విమాన టిక్కెట్లు, ప్రయాణంలో సందర్శనా స్థలాల్లో ప్రవేశ ఛార్జీలు, ప్రయాణ బీమా సౌకర్యం కూడా ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి.

ఇవి కూడా చదవండి

మొదటి రోజు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మొదలవుతుంది. కొలంబో చేరుకున్న తర్వాత  శ్రీలంక రామాయణ యాత్ర శాంకరీ దేవి శక్తి పీఠ్ ఎక్స్ హైదరాబాద్‌ టూర్ మొదలవుతుంది. ఇక్కడ కొలంబో, దంబుల్లా, క్యాండీ , నువరేలియా వంటి రామాయణ ఇతిహాసాలలో సంబంధం ఉన్న ప్రదేశాలను, ప్రకృతి అందాలను చూడవచ్చు.

INR టూర్ ప్యాకేజీ ధర వివరాల్లోకి వెళ్తే

ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టికెట్ ధర : రూ. 62, 660/-

డబుల్ షేరింగ్ టికెట్ ధర  : రూ. 51, 500/-

ట్రిపుల్ షేరింగ్ టికెట్ ధర  : రూ. 49, 930/-

చిన్న పిల్లలకు విత్ బెడ్ తో కావాలంటే టికెట్ ధర : రూ. 39, 440/-

బెడ్ అవసరం లేని పిల్లలకు టికెట్ ధర : రూ. 37, 430/-

జూన్ 1వ తేదీన మొదలు కానున్న శ్రీ లంక రామాయణ యాత్ర ప్యాకేజీ గురించి మరిన్ని వివరాలు  తెలుసుకోవడానికి లేదా ప్రయాణాన్ని బుక్ చేసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇతర టూర్ ప్యాకేజీలను www.irctctourism.comలో సందర్శించవచ్చు .

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!