మొబైల్ టార్చ్‌తో డాక్టర్ సిజేరియన్‌ .. తల్లీబిడ్డ మృతి..ఆస్పత్రి దగ్గర కుటుంబ సభ్యుల ఆందోళన

ఓ వైద్యుడు గర్భవతికి మొబైల్ ఫోన్ లోని లైట్ తో ఆపరేషన్ చేసి.. తల్లి బిడ్డ మృతికి కారణం అయ్యాడు. ఈ దారుణ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. నగరంలోని సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హాస్పిటల్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో కరెంటు పోవడంతో డాక్టర్ మొబైల్ టార్చ్ వెలుగుతో సిజేరియన్ చేశారు . అయితే దురదృష్టవశాత్తు తల్లి, నవజాత చనిపోయారు.

మొబైల్ టార్చ్‌తో డాక్టర్ సిజేరియన్‌ .. తల్లీబిడ్డ మృతి..ఆస్పత్రి దగ్గర కుటుంబ సభ్యుల ఆందోళన
C Section Using Flashlight
Follow us

|

Updated on: May 04, 2024 | 12:37 PM

భూమి మీద నడిచే దైవం వైద్యుడు అని మన నమ్మకం. అందుకనే వైద్యో నారాయణో హరిః అని దైవంతో సమానంగా భావించి గౌరవిస్తాం..ఒక జీవి ప్రాణం పోయాల్సి వస్తే.. తాను ఎక్కడ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ముందుగా రోగి గురించి ఆలోచిస్తాడు. అలాంటి డాక్టర్ అతి విశ్వాసంతో నైనా లేదా బాధ్యతారాహిత్యంతో చేసే చేసే చిన్న చిన్న పనులు దారుణమైన విషాదాన్ని మిగులుస్తాయి. తాజాగా ఓ వైద్యుడు గర్భవతికి మొబైల్ ఫోన్ లోని లైట్ తో ఆపరేషన్ చేసి.. తల్లి బిడ్డ మృతికి కారణం అయ్యాడు. ఈ దారుణ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. నగరంలోని సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హాస్పిటల్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో కరెంటు పోవడంతో డాక్టర్ మొబైల్ టార్చ్ వెలుగుతో సిజేరియన్ చేశారు . అయితే దురదృష్టవశాత్తు తల్లి, నవజాత చనిపోయారు. ఆస్పత్రిలో విద్యుత్ పోవడంతో గందరగోళం నెలకొందని.. అందుకనే తల్లీ బిడ్డ చనిపోయారని మృతురాలి కుటుంబ సభ్యులు మంగళ, బుధవారాల్లో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్ సిలిండర్లు వంటి అత్యవసర పరికరాలు లేవని మహిళ బంధువులు ఆరోపిస్తున్నారు.

ముంబైలోని భాండూప్‌కు చెందిన సహిదున్నిస్సా అన్సారీ (26) అనే యువతికి ప్రసవ నొప్పులు రావడంతో  హనుమాన్ నగర్‌లోని సుష్మా స్వరాజ్ ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. గర్భస్థ శిశువు హృదయ స్పందనలో  హెచ్చుతగ్గులు ఉండడంతో నార్మల్ డెలివరీ కష్టంగా ఉందని.. కడుపులో బిడ్డ బరువు 4 కేజీలుందని  వైద్యులు తెలిపారు. అనంతరం వైద్యుల సలహా మేరకు గర్భవతి సిజేరియన్‌ చేయించుకునేందుకు  అంగీకరించింది.

ఆపరేషన్ థియేటర్ లో సిజేరియన్‌ చేస్తున్న సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అయితే  ఆస్పత్రిలో జనరేటర్‌ లేకపోవడంతో డాక్టర్‌ మొబైల్‌ టార్చ్‌తో సిజేరియన్‌ చేశారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అంతే కాకుండా ఆక్సిజన్ లేకపోవడంతో తల్లి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే తల్లిని ఎల్‌టీఎంజీ సియాన్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక తల్లి కూడా మృతి చెందింది. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..
ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?
మెడికల్ షాపులు, క్లినిక్‎లపై అధికారుల కొరడా.. డ్రగ్స్ రాకెట్‎పై..
మెడికల్ షాపులు, క్లినిక్‎లపై అధికారుల కొరడా.. డ్రగ్స్ రాకెట్‎పై..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!