Karnataka: సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియో కేసులో మరో ట్విస్ట్.. బాధితురాలి కిడ్నాప్!

కర్ణాటకలోని హసన్ నియోజకవర్గ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియో కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రజ్వల్ తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను కూడా ప్రధాన నిందితుడిగా చేర్చారు. అయితే తాజాగా మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడిన కేఆర్ నగర్ బాధితురాలి అదృశ్యం కేసులో భవానీ రేవణ్ణ బంధువును అధికారులు అరెస్టు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఇదే తొలి అరెస్ట్.

Bhavani Revanna
Follow us

|

Updated on: May 04, 2024 | 12:05 PM

కర్ణాటకలోని హసన్ నియోజకవర్గ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియో కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రజ్వల్ తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను కూడా ప్రధాన నిందితుడిగా చేర్చారు. అయితే తాజాగా మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడిన కేఆర్ నగర్ బాధితురాలి అదృశ్యం కేసులో భవానీ రేవణ్ణ బంధువును అధికారులు అరెస్టు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఇదే తొలి అరెస్ట్.

అదృశ్యమైన బాధితురాలి కుమారుడు మే 3వ తేదీన కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. హెచ్‌డీ రేవణ్ణపై సెక్షన్ 364/ఏ 365, 34 కింద కేసు నమోదు చేశారు. నిందితుడు A1గా రేవణ్ణ, నిందితుడు A2గా సతీష్‌బాబును చేర్చారు. బాధితుడి ఆచూకీ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం 40కి పైగా చోట్ల దాడులు చేసింది. ఏ స్థలంలో మహిళను దాచారన్న దానిపై ఆరా తీస్తున్నారు. గురువారం అర్థరాత్రి నుంచి సిట్ బృందాలు మైసూరు, హాసన్, మాండ్యా జిల్లాలు, బెంగళూరు నగరంతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి.

ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని అధికారులు భవానీ రేవణ్ణకు నోటీసులు జారీ చేశారు. కాగా, రేవణ్ణ ప్రస్తుతం బెంగళూరులోని ఓ అజ్ఞాత ప్రదేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. తన లాయర్ ద్వారా ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇదిలావుంటే, ఈరోజు సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని రేవణ్ణకు సిట్ రెండోసారి నోటీసులు జారీ చేసింది. రేవణ్ణకు ఈరోజు ముందస్తు బెయిల్ లభిస్తే విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?

మెడికల్ షాపులు, క్లినిక్‎లపై అధికారుల కొరడా.. డ్రగ్స్ రాకెట్‎పై..

Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..

రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి

'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్

'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్

చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!

నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?

పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!