ఇలా ఉన్నారేంట్రా బాబూ..! టిప్ టాప్‌గా విమానంలో వచ్చారు.. కట్ చేస్తే, ప్యాంటు లోపల..

టిప్ టాప్‌గా విదేశాల నుంచి వచ్చారు.. వీళ్లంతా ఎంత మంచొళ్లో అనుకున్నారు.. అంతలోనే అనుమానం రావడంతో పోలీసులు ఆపి చెక్ చేశారు. ఇంకేముంది.. వాళ్ల అసలు బాగోతం బయటపడింది.. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం సహా విలువైన వస్తువులు పట్టుబడ్డాయి.

ఇలా ఉన్నారేంట్రా బాబూ..! టిప్ టాప్‌గా విమానంలో వచ్చారు.. కట్ చేస్తే, ప్యాంటు లోపల..
Mumbai Airport
Follow us

|

Updated on: May 04, 2024 | 1:04 PM

టిప్ టాప్‌గా విదేశాల నుంచి వచ్చారు.. వీళ్లంతా ఎంత మంచొళ్లో అనుకున్నారు.. అంతలోనే అనుమానం రావడంతో పోలీసులు ఆపి చెక్ చేశారు. ఇంకేముంది.. వాళ్ల అసలు బాగోతం బయటపడింది.. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం సహా విలువైన వస్తువులు పట్టుబడ్డాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు 20 కేసుల్లో 12.74 కేజీల బంగారంతో పాటు రూ.8.37 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పౌడర్‌గా మార్చి తీసుకు వస్తున్న ప్రయాణికుడితో పాటు సెల్‌ఫోన్స్‌ను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బంగారాన్ని అండర్‌గార్మెంట్స్‌లో ఉంచి, వాటర్ బాటిళ్లలో కూడా ఉంచి అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

దుబాయ్ నుండి వచ్చిన ఒక భారతీయ పౌరుడిని CISF సిబ్బంది ఆపి కస్టమ్స్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. అతని లగేజీని పరిశీలించగా.. వాటర్ బాటిల్‌లో మొత్తం 2580.00 గ్రాముల బరువుతో మైనపు రూపంలో 24 KT బంగారం పొడిన కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.

వీడియో చూడండి..

దుబాయ్ నుంచి వస్తున్న మరో నలుగురు ప్రయాణికులను కూడా అధికారులు విమానాశ్రయంలోనే అరెస్టుచేశారు. వారి వద్ద 3,335 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వారు తమ లోదుస్తుల లోపల బంగారాన్ని దాచిపెట్టి తీసుకొస్తుండగా.. వారిని అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు రోజు దుబాయ్ నుంచి ప్రయాణికులను తీసుకొచ్చిన విమానం పైపులో కూడా సుమారు కిలోన్నర బంగారాన్ని ఉంచగా.. పోలీసులు పట్టుకున్నారు. బంగారంతో పాటు రూ.20 లక్షల విలువైన 20 ఎలక్ట్రానిక్ వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇలా మొత్తం.. వివిధ దేశాల నుండి వచ్చిన పదిహేను మంది భారతీయులను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పది మంది దుబాయ్ నుంచి, ఇద్దరు మస్కట్ నుంచి, ఒక్కొక్కరు బహ్రెయిన్, అబుదాబి, జెద్దా నుంచి తిరిగి వచ్చారని అధికారులు తెలిపారు.

అంతకుముందు ఫిబ్రవరిలో విమానాశ్రయంలో అధికారులు రూ.1.98 కోట్ల విలువైన 3.59 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదు వేర్వేరు కేసుల్లో జప్తు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..
ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?
మెడికల్ షాపులు, క్లినిక్‎లపై అధికారుల కొరడా.. డ్రగ్స్ రాకెట్‎పై..
మెడికల్ షాపులు, క్లినిక్‎లపై అధికారుల కొరడా.. డ్రగ్స్ రాకెట్‎పై..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!