Lok Sabha Election: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థి.. కారణం ఏంటో తెలుసా..?

సూరత్, ఇండోర్ తర్వాత కాంగ్రెస్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని పూరీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మొహంతి నిరాకరించారు. పార్టీ ఎలాంటి ఆర్థిక సహాయం అందించడం లేదని మొహంతి ఆరోపించారు. పార్టీ నిధులు లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడం సాధ్యం కాదని, అందుకే ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించానన్నారు. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా సంబిత్ పాత్రా బరిలోకి ఉన్నారు.

Lok Sabha Election: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థి.. కారణం ఏంటో తెలుసా..?
Sucharita Mohanty
Follow us

|

Updated on: May 04, 2024 | 1:22 PM

సూరత్, ఇండోర్ తర్వాత కాంగ్రెస్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని పూరీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మొహంతి నిరాకరించారు. పార్టీ ఎలాంటి ఆర్థిక సహాయం అందించడం లేదని మొహంతి ఆరోపించారు. పార్టీ నిధులు లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడం సాధ్యం కాదని, అందుకే ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించానన్నారు. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా సంబిత్ పాత్రా బరిలోకి ఉన్నారు.

తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు సచరిత మొహంతి. ఈ లేఖలో, తనకు నిధులు ఇవ్వడానికి పార్టీ నిరాకరించినందున పూరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రచారం చేయలేకపోతున్నానని, ఈ విషయాన్ని ఒడిశా కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ అజోయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఇకపై పూరీ నియోజకవర్గానర్ని మీరే రక్షించుకోండి. అంటూ కేసీ వేణు గోపాల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

అంతేకాదు..” నేను జీతం తీసుకునే ప్రొఫెషనల్ జర్నలిస్ట్‌ని. పదేళ్ల క్రితం ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చాను. పూరీలో ప్రచారంలో సర్వస్వం కొల్పోయాను. ప్రగతిశీల రాజకీయాల కోసం ప్రజా విరాళ యాత్ర నిర్వహించాను. కానీ పెద్దగా విజయం సాధించలేదు. అంచనా వేసిన ప్రచార ఖర్చులను తగ్గించడానికి కూడా ప్రయత్నించాను. ఫలితం లేకపోయింది. సొంతంగా నిధులు సేకరించలేనని, అందుకే మీ అందరి తలుపులు తట్టి, పార్టీ కేంద్ర నాయకత్వానికి పూరీ పార్లమెంట్ స్థానంపై ఎన్నికల ప్రచారానికి అవసరమైన నిధులు సమకూర్చాలని అభ్యర్థించాను. నాకు ఎలాంటి మద్దతు లభించలేదు. పూరీలో విజయవంతమైన ప్రచారానికి నిధుల కొరత మాత్రమే అడ్డుగా నిలుస్తోందని” అంటూ కేసీ వేణుగోపాల్‌కు రాసిన లేఖలో సుచరిత పేర్కొన్నారు.

Sucharita Mohanty Letter

Sucharita Mohanty Letter

పూరీ లోక్‌సభ పరిధిలోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో బలహీన అభ్యర్థులకు తమతో చర్చించకుండానే టిక్కెట్లు ఇచ్చారని సుచరిత అంటున్నారు. బీజేపీ, బీజేడీలు డబ్బు సంచులని, కాంగ్రెస్‌ నుంచి బీజేపీ నిధులు నిలిపివేసిందని, ఎలక్టోరల్‌ బాండ్ల నుంచి తామే చాలా డబ్బు తీసుకున్నామని అన్నారు. ఇప్పుడు ఆ పార్టీకి మరొకరిని అభ్యర్థిగా నిలబెట్టే సమయం వచ్చిందన్నారు. ఇదిలావుంటే, స్వయాన జర్నలిస్ట్ అయ్యిన సుచరిత మొహంతి 2014లో కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా పూరీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ.

ఇండోర్‌‌లో కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ..!

ఇటీవల మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇండోర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షయ్‌ బామ్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. నామినేషన్ చివరి తేదీకి ఒక రోజు ముందు అక్షయ్ బామ్ ఈ పని చేశారు. అక్షయ్ ఏప్రిల్ 24న ఇండోర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇండోర్ ఎంపీ శంకర్ లాల్వానీ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. లాల్వానీ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ.

సూరత్‌లో ఏం జరిగింది?

అంతకుముందు గుజరాత్‌లోని సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అతని ప్రతిపాదకుల సంతకాలలో కొన్ని తప్పులు ఉన్నాయని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అనంతరం ఆ స్థానంలో ఉన్న అభ్యర్థులందరూ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీని తర్వాత సూరత్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles