Viral Video: బాత్రూం నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా…
ఇంట్లో ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఉన్నఫలంగా బాత్రూం నుంచి ఎప్పుడూ వినని శబ్దాలు వినిపించాయి. ఇంట్లో వాళ్లకు ఏం అర్థం కాలేదు. ఒకరు వెళ్లి బాత్రూం తలుపు తీసి చూసి.. భయంతో పరుగులు పెట్టారు. ఇంతకీ అక్కడ ఏముంది.. భయపడటానికి కారణం ఏంటి..? తెలుసుకుందాం పదండి....
పొద్దు కూకుతోంది. ఆ ఇంట్లో ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఈ క్రమంలో ఆ ఇంట్లోని అటాచుడ్ బాత్రూం నుంచి ఏవో విచిత్ర శబ్దాలు రావడం ఆ ఇంట్లోని వ్యక్తి గమనించాడు. వెళ్లి వాష్‌రూమ్ డోర్ ఓపెన్ చేసి టాయిలెట్ బౌల్‌లో కనిపించింది చూసి అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ ఘటనకు సంబంధించిన వైరల్ వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే… మహారాష్ట్రలోని ఓ వ్యక్తి.. టాయిలెట్ సీటు నుండి విచిత్ర శబ్ధాన్ని విన్నాడు. లోపల ఏదైనా వాటర్ లీక్ అవుతుందా..? లేదా ప్లంబింగ్ సమస్య ఏమో అని వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూశాడు. టాయిలెట్‌లో బౌల్‌లో పాము కనిపించేసరికి బిత్తరపోయాడు. వెంటనే స్నేక్ క్యాచర్ పాములు పట్టే శీతల్ కాసర్‌కు సమాచారమిచ్చాడు.
పాము పట్టడంలో ఎక్స్‌పర్ట్ శీతల్ ఈ పాముకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో ఈ పాము విషపూరితమైనది కాదని చెప్పింది. అవి దాదాపు 9 నుంచి 10 అడుగులు వరకు పెరుగుతాయని తెలిపింది. ఇది భారతీయ ఎలుక పాము అని పిలుస్తారని.. ఇది ప్రకృతిలో విషపూరితం కానిది” అని ఆమె పేర్కొంది. మరుగుదొడ్డి నుంచి పామును మెల్లగా బయటకు తీయడం వీడియోలో కనిపిస్తుంది. బయటకు రాగానే పాము పొడవును చూసి కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యపోయారు. శీతల్ మాత్రం పామును చేతితో పట్టుకుని ఇంటి నుండి బయటకు తీసుకొచ్చింది. ఆమె పోస్ట్‌లోని క్యాప్షన్ విభాగంలో పాము రంగు, ఆకారాన్ని వివరించింది.
View this post on Instagram
ఈ పాము సాధారణంగా వివిధ రంగుల షేడ్స్‌లో పొడవాటి సాగే శరీరాల్లో కనిపిస్తుందని ఆమె పేర్కొంది. “వాటి ముఖంపై కుట్లు వంటి నల్లటి గీతలు ఉంటాయని.. ఇవిచాలా చురుగ్గా కదులుతాయి” అని శీతల్ కాసర్ తెలిపింది. పాము ప్రధానంగా ఎలుకల బొరియలు ఉండే మానవ నివాస ప్రాంతాలలో కనిపిస్తుందని వెల్లడించింది. ఈ పాములు సాధారణంగా ఎలుకలు, కప్పలను తింటాయని వెల్లడించింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..