Summer Cooling Tips: వేడి నుంచి రక్షించే మూలికలు.. ఇవి తీసుకుంటే బాడీ చల్లగా ఉంటుంది..

వేసవి వచ్చిందంటే చాలా మంది భయ పడిపోతూ ఉంటారు. ఎండ సంగతి పక్కన పెట్టినా.. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడి పోతారు. శరీరం అంతా వేడిగా మారిపోతుంది. దీంతో అనేక రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందులో చెమటకాయలతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే..

Summer Cooling Tips: వేడి నుంచి రక్షించే మూలికలు.. ఇవి తీసుకుంటే బాడీ చల్లగా ఉంటుంది..
Summer Cooling Tips
Follow us

|

Updated on: May 04, 2024 | 1:01 PM

వేసవి వచ్చిందంటే చాలా మంది భయ పడిపోతూ ఉంటారు. ఎండ సంగతి పక్కన పెట్టినా.. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడి పోతారు. శరీరం అంతా వేడిగా మారిపోతుంది. దీంతో అనేక రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందులో చెమటకాయలతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే.. సమ్మర్‌లో శరీరాన్ని కూల్‌గా ఉంచుకోవాలి. అలాగని కూలింగ్ వాటర్ తాగకూడదు. దీని వల్ల శరీరం మరింత వేడెక్కుతుంది. శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. మనం నిత్యం ఉపయోగించే వాటితోనే మీరు శరీరాన్ని చల్లబరచుకోవచ్చు. శరీరంపై చెమటకాయలు, ర్యాషెస్, దురద వంటి వాటిని తగ్గిస్తాయి. బాడీని కూల్ చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

కొత్తిమీర:

కొత్తిమీర అనేది తరచూ మనం వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. కొత్తిమీరలో చల్లదనాన్ని అందించే గుణాలు ఉన్నాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తాయి. కొత్తి మీర రైస్, జ్యూస్, చట్నీ చేసి తింటూ ఉంటే.. మంచి ఫలితాలు ఉంటాయి. మజ్జిగలో కూడా కొత్తిమీర పేస్ట్‌ ఉపయోగించవచ్చు.

పుదీనా:

చాలా మంది పుదీనాను కేవలం బిర్యానీ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ పుదీనా తీసుకుంటే.. బాడీ కూల్ అవుతుంది. పుదీనాలో కూడా కూలింగ్ గుణాలు ఉన్నాయి. అంతే కాదు పుదీనా తీసుకుంటే ఎంతో రీఫ్రెషింగ్‌గా ఉంుటంది. పుదీనా జ్యూస్, చట్నీ, మజ్జిగలో వేసుకుని తాగడం వంటివి చేయడం వల్ల బాడీ కూల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

వేపాకులు:

వేపను ఎన్నో శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. వేప చెట్టులోని ప్రతీ భాగం కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి ఉపయోగించుకోవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి శరీరంపై ఉండే బ్యాక్టీరియాను తొలగించడంలో చక్కగా పని చేస్తుంది. వేపాకులు వేసి మరిగించిన నీటితో.. స్నానం చేస్తే.. చల్లగా ఉండటమే కాకుండా.. అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.

NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

Latest Articles
స్మార్ట్‌ వాచ్‌ కమ్‌ లాకెట్‌.. ఐటెల్‌ నుంచి అదిరిపోయే గ్యాడ్జెట్‌
స్మార్ట్‌ వాచ్‌ కమ్‌ లాకెట్‌.. ఐటెల్‌ నుంచి అదిరిపోయే గ్యాడ్జెట్‌
ఈ ప్లేయర్స్ కోహ్లికి తమ్ములబ్బా.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత
ఈ ప్లేయర్స్ కోహ్లికి తమ్ములబ్బా.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత
అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..
అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..
'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?
'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?
టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం
టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం
కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..