AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు.. మీరూ ట్రై చేయండి..

ప్రస్తుత కాలంలో అనేక అనారోగ్య సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. ఇలాంటి వాటిల్లో మలబద్ధకం ఒకటి.. మలబద్ధకాన్ని ఒక సాధారణ వ్యాధిగా పరిగణించవచ్చు.. కానీ ఇది చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుంది. కడుపులో గ్యాస్ ఏర్పడటం, కడుపు నొప్పి పెరిగినప్పుడు.. మలబద్ధకం ఏర్పడిందని అర్థం చేసుకోవాలి..

నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు.. మీరూ ట్రై చేయండి..
Early Morning Habits
Shaik Madar Saheb
|

Updated on: May 04, 2024 | 11:59 AM

Share

ప్రస్తుత కాలంలో అనేక అనారోగ్య సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. ఇలాంటి వాటిల్లో మలబద్ధకం ఒకటి.. మలబద్ధకాన్ని ఒక సాధారణ వ్యాధిగా పరిగణించవచ్చు.. కానీ ఇది చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుంది. కడుపులో గ్యాస్ ఏర్పడటం, కడుపు నొప్పి పెరిగినప్పుడు.. మలబద్ధకం ఏర్పడిందని అర్థం చేసుకోవాలి.. ఈ సమస్య అన్ని వయసుల వారికి.. ఎవరికైనా రావచ్చు. దీని వెనుక అనేక కారణాలు ఉంటాయి. అయితే.. కొన్ని ఉదయపు అలవాట్లను అలవర్చుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఉదయం వేళ ఈ అలవాట్లను పాటించడం ద్వారా మలబద్ధకం సమస్యను నివారించవచ్చు..

అవేంటో తెలుసుకోండి..

హైడ్రేటెడ్‌గా ఉండండి: డీహైడ్రేషన్ మలబద్ధకం కలిగించే ప్రాథమిక కారకాలలో ఒకటి.. మీకు మలబద్ధకం అనిపిస్తే, ఉదయం నిద్రలేచిన తర్వాత నీరు త్రాగాలి. ఇది మలాన్ని మృదువుగా చేయడానికి.. ప్రేగు కదలికలను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా, అజీర్ణం నివారించడానికి, కార్బోనేటేడ్ పానీయాలకు బదులుగా తాజా రసం త్రాగాలి.. ఎల్లప్పుడూ నీటిని, పానీయాలను, మజ్జిగను తీసుకుంటూ ఉంటే డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు..

పని, వ్యాయామం లాంటివి చేయండి: ఒకే చోట నిష్క్రియంగా ఉండటం వల్ల మలబద్ధకం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఉదయం నిద్రలేచిన తర్వాత వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. ఉదయం వేళ రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ లేదా జాగింగ్ లాంటివాటిని దినచర్యలో భాగం చేసుకోండి.. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

పొత్తికడుపు మసాజ్ చేయండి: పొత్తికడుపు మసాజ్ స్టూల్ ట్రాన్సిట్ సమయాన్ని తగ్గిస్తుందని అనేక పరిశోధనలు నిరూపించాయి. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఉదయం వేళ మలబద్ధకం అనిపిస్తే, మీ కడుపుపై ​​తేలికపాటి ఒత్తిడిని కలిగించి సవ్యదిశలో మసాజ్ చేయండి. ఇది చాలా ఉపశమనం కలిగించవచ్చు.

ప్రోబయోటిక్స్ తినండి: ప్రోబయోటిక్స్ అనేది మీ గట్‌లో సహజంగా సంభవించే ప్రత్యక్ష, ప్రయోజనకరమైన బ్యాక్టీరియా.. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బాక్టీరియా అసమతుల్యతను కలిగి ఉంటారు. ఇది ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా మెరుగుపడుతుంది. వీటిలో పెరుగు, కిమ్చి ఉన్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..