Yoga for Body Cooling: ఈ యోగాసనాలు వేశారంటే.. వేసవిలో కూడా కూల్‌గా ఉంటారు..

వేసవిలో వేడి, ఉక్కపోత అనేవి కామన్. ఈ వేడిని, ఉక్కపోతను భరించలేక చాలా మంది కూలర్లు, ఏసీలు ఉపయోగిస్తున్నారు. ఈ సారి ఎండలు మరీ గట్టిగా ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి బయటకు వెళ్లలేక పోతున్నాం. అయితే చాలా మంది ఈ ఎండలను భరించలేరు. వేసవిలో శరీరాన్ని చల్ల బరిచేందుకు ముందు.. చలువ చేసే ఆహారాలు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు చెప్పే యోగాసనాలు చేసినా..

Yoga for Body Cooling: ఈ యోగాసనాలు వేశారంటే.. వేసవిలో కూడా కూల్‌గా ఉంటారు..
Yoga For Body Cooling
Follow us

|

Updated on: May 04, 2024 | 12:49 PM

వేసవిలో వేడి, ఉక్కపోత అనేవి కామన్. ఈ వేడిని, ఉక్కపోతను భరించలేక చాలా మంది కూలర్లు, ఏసీలు ఉపయోగిస్తున్నారు. ఈ సారి ఎండలు మరీ గట్టిగా ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి బయటకు వెళ్లలేక పోతున్నాం. అయితే చాలా మంది ఈ ఎండలను భరించలేరు. వేసవిలో శరీరాన్ని చల్ల బరిచేందుకు ముందు.. చలువ చేసే ఆహారాలు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు చెప్పే యోగాసనాలు చేసినా.. శరీరానికి చక్కటి విశ్రాంతి లభించడమే కాకుండా.. బాడీలో నుంచి వేడి బయటకు వెళ్లి కూల్ అవుతుంది. అంతే కాకుండా మీరు ఫిట్‌గా ఉండేందుకు కూడా ఇవి హెల్ప్ అవుతాయి. శరీరాన్ని ఫిట్‌గా, కూల్‌గా ఉంచే ఆ ఆసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మత్స్య ఆసనం:

శరీరానికి అనేక ప్రయోజనాలను అందించే ఆసనాల్లో మత్స్యాసనం కూడా ఒకటి. ఈ ఆసనం వేయడం వల్ల మెడ దృఢంగా మారుతుంది. శ్వాస తీసుకోవడంలో, విశ్రాంతిని ప్రోత్సహించడంలో అనేక రకాలుగా ఈ ఆసనం యూజ్ అవుతుంది. ఈ ఆసనం వేయడం కూడా సులభమే. అంతే కాకుండా బాడీని కూల్ చేస్తుంది.

వృక్షాసనం:

చాలా మందికి వృక్షాసనం గురించి తెలుసు. ఈ ఆసనాన్ని కూడా సులభంగానే వేయవచ్చు. ఈ ఆసనం వేయడం వల్ల కాలు కండరాలు, తొడలు బలంగా, దృఢంగా, ఏకాగ్రతను మెరుగు పరచడంలో, శరీరాన్ని సమతుల్యం చేయడంలో, విశ్రాంతిని కలిగించడంలో ఈ ఆసనం చక్కగా సహాయ పడుతుంది.

ఇవి కూడా చదవండి

శవాసనం:

శవాసనంతో కూడా శరీరానికి ఎంతో రిలీఫ్ నెస్ దొరుకుతుంది. ఈ ఆసనాన్ని ఎవరైనా సరే వేసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించడంలో, మనసుకు ప్రశాంతతను కలిగించడంలో చక్కగా ఉపయోగ పడుతుంది.

పద్మాసనం:

పద్మాసనం దీన్నే లోటస్ పోజ్ అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం వేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. శరీర ఆరోగ్యం, శ్రేయస్సు పెంపొందించడంలో ఈ ఆసనం ఎంతో సహాయ పడుతుంది. శరీరం కూడా కూల్ అవుతుంది.

బుద్ధ కోనాసనం:

బుద్ధ కోనాసనం.. దీన్నే ‘సీతాకోకచిలుక భంగిమ’, ‘బటర్ ఫ్లై పోజ్’ అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం వేయడం వల్ల వెన్నుముక బలంగా మారుతుంది. వెన్నుముక సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరం ఫిట్‌గా ఉంటుంది. ముఖ్యంగా శరీరం చల్లబడుతుంది.

NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

Latest Articles