Palak Pakoda Recipe: గుమ గుమలాడే పాలకూర పకోడీ.. ఇలా ఈజీగా తయారు చేసుకోండి..

Palak Pakoda Recipe: పాలకూర తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇందులో ఐరన్, కాల్షియం, సోడియం, క్లోరిన్, భాస్వరం, ఖనిజాలు, ప్రోటీన్లు

Palak Pakoda Recipe: గుమ గుమలాడే పాలకూర పకోడీ.. ఇలా ఈజీగా తయారు చేసుకోండి..
Palak Pakoda
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 18, 2021 | 3:11 PM

Palak Pakoda Recipe: పాలకూర తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇందులో ఐరన్, కాల్షియం, సోడియం, క్లోరిన్, భాస్వరం, ఖనిజాలు, ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పాలకూరతో రకరకాల వంటకాలు చేయవచ్చు. పాలకూరను కూరగానే కాకుండా పకోడీలు కూడా చేసుకుని తినొచ్చు. సాయంకాలం పూట వేడి వేడి పాలకూర పకోడిలు చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. టెస్ట్‌కి టెస్టీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుంది. ఇక వర్షాకాలంలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జడివాడలో వేడి వేడి పకోడీలు చేసుకుని తింటే ఆ మజానే వేరు. ఈ పాలకూర పకోడీలను చేసుకోవడం కూడా చాలా సులభం. మరి ఈ పకోడీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలకూర పకోడీ తయారీకి కావాల్సినవి.. 1. ఉప్పు సరిపడినంత.. 2. ఉల్లిపాయ – 2 పెద్దది 3. పాలకూర – 2 కప్పులు 4. చనా పిండి – 7 టీస్పూన్లు 5. ఎర్ర మిరప పొడి – 1 స్పూన్ 6. పసుపు పొడి – 1 స్పూన్ 7. కాల్చిన కొత్తిమీర గింజల పొడి 8. వాము – ఒక టీ స్పూన్. 9. నూనె 10. ఒక చిటికెడు బేకింగ్ సోడా

పాలకూర పకోడీలను ఎలా తయారు చేయాలంటే.. 1. ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. 2. మెత్తగా తరిగిన పాలకూర, ఉల్లిపాయను గ్రాము పిండి, ఉప్పు, ఇతర పొడి సుగంధ ద్రవ్యాలతో కలపండి. 3. పిండిని సరిగా కలపాలి. ఆ పిండిలో ఒక టేబుల్ స్పూన్ వంట నూనె, సరిపడా నీరు కలపాలి. 4. ఇప్పుడు ఇప్పుడు పిండిని చిన్న చిన్న భాగాలుగా తీసుకుని నూనెలో వేయించాలి. 5. మీకు ఇష్టమైన చట్నీతో కలిపి వేడి వేడి పాలకూర వడలను కుమ్మేయండి..

పాలకూరతో ఆరోగ్య ప్రయోజనాలు.. పాలకూర తినడం వలన.. ఇన్ఫెక్షన్ ప్రమాదం నుంచి బయటపడొచ్చు. పాలకూరలో విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది కాకుండా, ఇందులో పొటాషియం, ఫోలేట్ ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది. పాలకూరలో కాల్షియం కూడా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. పాలకూరలో మెగ్నీషియం ఉంటుంది. ఇది మన శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. పాలకూర తినడం వల్ల మన రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలోని టాక్సిన్‌లను తొలగిస్తుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. అనేక రకాల క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. పాలకూరలో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్‌లు.. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Also read:

Kiss in Bus: ‘గీతాగోవిందం’ సినిమా చూసి రెచ్చిపోయిన యువకుడు.. బస్సులో పక్క సీట్లో కూర్చున్న అమ్మాయిని..

Minister KTR: విశ్వరూపం చూపించిన మంత్రి కేటీఆర్.. డ్రగ్స్, పాలిటిక్స్‌పై సంచలన కామెంట్స్..

Viral Video: ఒక్క బైక్‌పై 13 మంది చిన్నారుల ప్రయాణం.. ఓరయ్యా ఏం చేద్దామనుకుంటున్నావ్ వారిని..!