Health Tips: ఏదైన తిన్న తర్వాత కడుపులో మంట, నొప్పి ఉంటే ఇలా చెక్ పెట్టేయ్యొచ్చు.. తెలుసుకోండి.

మారుతున్న జీవనశైలి కారణంగా.. చాలా మంది కడుపు నొప్పి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా.. కడుపులో మంట, నొప్పి

Health Tips: ఏదైన తిన్న తర్వాత కడుపులో మంట, నొప్పి ఉంటే ఇలా చెక్ పెట్టేయ్యొచ్చు.. తెలుసుకోండి.
Stomach Pain
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 18, 2021 | 11:39 AM

మారుతున్న జీవనశైలి కారణంగా.. చాలా మంది కడుపు నొప్పి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా.. కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. పనిభారం.. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన గ్యాస్, అల్సర్, కడపునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే పచ్చిమిర్చి, మసాలా దినుసులు తినడం వలన చాలా మందిలో ఎసిడిటి సమస్య ఏర్పడుతుంది. దీంతో తమకు ఇష్టమైన ఆహారం తీసుకోవడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. అలాగే ఈ సమస్యల నుంచి బయటపడేందుకు అనేక రకాల సప్లిమేంట్స్ ఉపయోగిస్తుంటారు. ఇక మరికొందరిలో ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలు కలుగుతుంటాయి. ఈ సమస్యలను మీ వంటగదిలో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందామా.

1. ఆహారం తిన్న తర్వాత కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలు ఏర్పడితే వెంటనే కొద్ది మొత్తంలో బెల్లం తినడం మంచిది. ఇది ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైములను విడుదల చేస్తాయి. అలాగే కడుపులో మంట సమస్య తగ్గుతుంది. 2. ఆహారం తిన్న వెంటనే అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. వెంటనే సోంపు నీరు తాగాలి. ఇందుకోసం ఒక కప్పు నీటిలో 1 టీస్పూన్ సోంపు కలపి రాత్రంతా వదిలెయ్యాలి. ఉదయాన్నే వడకట్టి.. ఆ నీటిని వేడిచేసి తీసుకోవాలి. ఒకవేళ రుచిని పెంచుకోవడానికి మీరు ఒక టీస్పూన్ తేనె కలుపుకోవచ్చు. 3. తిన్న తర్వాత కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలు రెగ్యులర్‏గా ఉన్నవాళ్లు.. ఎక్కువగా అలోవేరా జ్యూస్ తీసుకోవడం ఉత్తమం. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అలేగ పేగులో నీటి శాతానని పెంచుతుంది. కడుపు నొప్పి సమస్యలు ఎక్కువగా ఉన్నవారికి ఈ జ్యూస్ చాలా ఎక్కువగా పనిచేస్తుంది. అయితే తక్కువ మోతాదులో ఈ అలోవేరా జ్యూస్ తీసుకోవాలి.

Also Read: Samantha : లేడీ ఓరియెంటెడ్ కథల వైపే అక్కినేని కోడలు ఆసక్తి.. మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్..

Maharshi Movie : మహేష్ ‘మహర్షి’ ఖాతాలో మరో అవార్డు.. బెస్ట్ యాక్టర్‌గా మరోసారి సూపర్ స్టార్..

Allu Arjun: మేడమ్ సర్ మేడమ్ అంతే.. అల వైకుంఠపురంలో క్రేజ్ అస్సలు తగ్గడంలేదుగా….