Orange Peel: తొక్కేకదాని తీసి పారేస్తున్నారా? దీని రహస్యం తెలిస్తే భద్రంగా దాచేస్తారు
చలికాలం సీజనల్ పండ్లలో నారింజ పండ్లు ఒకటి. ఇవి తక్కువ ధరతోపాటు అందరికీ అందుబాటులో ఉంటాయి. అయితే ఈ కాలంలో వీటిని తింటే లేనిపోని రోగాలు వస్తాయని అందరూ అనుకుంటారు. అయితే ఇది నిజంకాదు. నారింజ పండ్లేకాదు వాటి తొక్కా, విత్తనాలు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు..
శీతాకాలంలో నారింజ పండ్లు పుష్కలంగా అందుబాటులోకి వస్తాయి. చాలా మంది జలుబు, దగ్గు వస్తుందని వీటికి దూరంగా ఉంటారు. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండు తినడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నారింజ పండ్లే కాదు, దాని గింజలు, తొక్క కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందట. ముఖ్యంగా నారింజ తొక్క (ఆరెంజ్ పీల్) శరీరానికి ఎలాంటి మేలు చేస్తుందో ఈ కింద తెలుసుకుందాం..
ఆరెంజ్ పీల్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరెంజ్ తొక్క చర్మం, శ్వాసకోశ సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. చలికాలంలో నారింజ పండ్లను ఇంటికి తెచ్చుకుంటే, వాటి పై తొక్కను మర్చిపోకుండా తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగజేస్తుందట. నారింజలో విటమిన్ సితోపాటు వివిధ పోషకాలు ఉంటాయి. నారింజ తొక్కలో ఉండే మినరల్స్ ఆరోగ్యానికి చాలా అవసరం. దీని తొక్కలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఆందోళన మాయమవుతుంది. మూడ్ బాగుంటుంది. హ్యాంగోవర్‌ను తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, చర్మం మెరిసేలా చేస్తుంది.
నారింజ తొక్కలో ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ బి6, కాల్షియం వంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి. ఆరెంజ్ పీల్స్ లో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి. లిమోనెన్ వంటి రసాయన సమ్మేళనాలు నిండుగా ఉంటుంది. ఈ పదార్థాలు క్యాన్సర్‌ను నిరోధించగలవు. నారింజ తొక్క క్యాన్సర్‌తో పోరాడటంలో బలేగా ఉపయోగపడుతుంది.
అయితే నారింజ తొక్కను ఎలా తింటారనేది అసలు ప్రశ్న.. దీన్ని నేరుగా తినడం శరీరానికి అంత మంచిది కాదు. నారింజ తొక్క రుచికి చేదుగా ఉంటుంది. ఇలా కాకుండా నేరుగా తినడానికి బదులు నారింజ తొక్కను వేడి నీటిలో వేసి బాగా కడగాలి. ఆ తర్వాత నారింజ తొక్కలను చిన్న ముక్కలుగా కట్‌చేసి సలాడ్‌లు, శాండ్‌విచ్‌లు, స్మూతీస్ వంటి మొదలైన వాటితో కలిపి నేరుగా తినవచ్చు. అంతేకాకుండా, నారింజ తొక్క పొడితో టీ తయారు చేసుకుని తాగవచ్చు. ఆరెంజ్ పీల్ జెల్లీని కూడా తయారు చేసి తినవచ్చు.