క్యారెట్లు ఆరోగ్యానికి మంచివే.. వీరికి మాత్రం విషంతో సమానం

02 January 2025

TV9 Telugu

TV9 Telugu

ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో క్యారెట్స్‌ ముందు వరుసలో ఉంటాయి. ఇవి ఎముకలు, కళ్లకేకాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. క్యారెట్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ ఉండటమే అందుకు కారణం

TV9 Telugu

క్యారెట్‌లో ఎ,సి,కె,బి విటమిన్లు, ఐరన్‌, క్యాల్షియం, పొటాషియంలు ఉన్నందున ఇది మంచి పోషకాహారంగా నిపుణులు భావిస్తున్నారు

TV9 Telugu

క్యారెట్‌లో ఉండే విటమిన్ సి మాక్యులర్ డిజెనరేషన్‌ను తగ్గించడం ద్వారా కళ్ళను ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది

TV9 Telugu

అలాగే ఆకలిని పెంచుతాయి. గుండెకు మంచిది. హైబీపీని తగ్గిస్తాయి. టైప్‌-2 డయాబెటిస్‌ను తగ్గిస్తాయి. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు నయమౌతాయి. క్యాన్సర్‌ కారకాలను నియంత్రిస్తాయి

TV9 Telugu

క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతున్నప్పటికీ, చలి కాలంలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్న వారు వీటిని తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

కడుపు నొప్పి ఉన్నవారు క్యారెట్‌లకు దూరంగా ఉండాలి. క్యారెట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇవి జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటూ వీటిరి దూరంగా ఉండాలి

TV9 Telugu

అలాగే మధుమేహ రోగులు క్యారెట్ జ్యూస్ తాగే ముందు వైద్యుడిని సంప్రదించాలి. క్యారెట్‌లో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని పెంచుతుంది

TV9 Telugu

స్కిన్ అలర్జీ ఉన్నవారు కూడా క్యారెట్ తినకూడదు. క్యారెట్‌లో ఉండే అలెర్జీ కారకం చర్మంపై దద్దుర్లు, విరేచనాలకు కారణమవుతుంది. క్యారెట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల గ్యాస్, అజీర్ణం సమస్యలు వస్తాయి