దానమిస్తే దోషాలు పోతాయంటారు. అదే పంటవేస్తే క్షేత్రం బాగుపడుతుందని చెబుతారు. ఆ నువ్వులే వంటల్లో వాడితే.. కొత్త రుచులు రువ్వుతాయి. జిహ్వకు రుచినిస్తాయి. ఒంటికి వేడినిస్తాయి. జఠరాగ్నిని ఉత్తేజపరుస్తాయి. కీళ్లకు సత్తువనిస్తాయి
TV9 Telugu
అందుకే మన పెద్దోళ్లు నువ్వుల పొడిని వంటల్లో తప్పనిసరి చేశారు. కాయగూరల్లో.. మాంసాహారంలో.. తియ్యటి చక్కీల్లో.. ఇలా ఎందెందు వెదికినా అందందే కనిపించేలా అను గ్రహించారు
TV9 Telugu
నల్ల నువ్వులు రుచికే కాదు అనేక వ్యాధులను నివారించడంలోనూ సహాయపడే పోషకాలను అందించే పవర్‌హౌస్ కూడా. రోజూ కాసిని నువ్వులని ఆహారంలో చేర్చుకునే వారికి కొలెస్ట్రాల్‌తోపాటు, ట్రైగ్లిజరాయిడ్లు అదుపులో ఉంటాయట
TV9 Telugu
ఫలితంగా గుండెజబ్బుల నుంచి రక్షణ దొరుకుతుంది. నువ్వుల్లో మేలు చేసే కొవ్వులు ఉండటమే ఇందుకు కారణం అంటున్నాయి అధ్యయనాలు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారికి నువ్వులు చేసే మేలు అంతాఇంతా కాదు
TV9 Telugu
మామూలు నువ్వులతో పోలిస్తే వేయించినవి తింటే మాంసకృత్తులు పుష్కలంగా అందుతాయట. ముఖ్యంగా కండరాల బలానికీ, హార్మోన్లు చురుగ్గా ఉండటానికీ ఇవి ఎంతో మేలు చేస్తాయి
TV9 Telugu
చర్మ సమస్యల నుండి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం వరకు నల్ల నువ్వులు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అయితే చాలా మంది వీటి రంగు చూసి తినేందుకు జంకుతుంటారు
TV9 Telugu
నల్ల నువ్వులలో విటమిన్లు, ఫైబర్, అమినో యాసిడ్, ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్, సూపర్ న్యూట్రీషియన్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నల్ల నువ్వులు శరీర బరువును తగ్గించడం ద్వారా ఫిట్‌గా ఉంచుతాయి
TV9 Telugu
కొలెస్ట్రాల్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేసేందుకు నల్ల నువ్వులను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. నల్ల నువ్వులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది