- Telugu News Photo Gallery What is the signs of Brain Fog: Solutions to Help You Improve Concentration
Brain Fog: యువతను కమ్మేస్తున్న బ్రెయిన్ ఫాగ్.. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే?
ఒక్కోసారి రాత్రంతా హాయిగా నిద్రపోయినా.. రోజంతా చికాకుగా ఉంటుంది. తెలియకుండానే అలసట, విసుగు, సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక అయోమయానికి గురవుతుంటారు. దీని వెనుక అసలు కారణం చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదేంటో.. అసలెందుకుకిలా జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Dec 30, 2024 | 1:12 PM

రాత్రంగా హాయిగా నిద్రపోతున్నా కొంతమందికి ఉదయం నిద్రలేచిన తర్వాత బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. చుట్టూ పొగలు కమ్ముకున్నట్లుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? రాత్రంతా నిద్రపోయినప్పటికీ ఉదయం లేచిన తర్వాత మనసంతా అల్లకల్లోలంగా ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండదు. ఏం మాట్లాడుతున్నారో తెలియక ట్రాక్ కోల్పోతుంటారు. ఇలాంటి లక్షణాలు ఎందుకు కనిపిస్తాయో తెలుసా..?

ఈ లక్షణాలన్నీ కనిపిస్తే మెదడుకు సంబంధించిన సమస్య ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. దీనికి వైద్య పరిభాషలో దీనిని బ్రెయిన్ ఫాగ్ అంటారు. అంటే మెదడు లోపల పొగమంచు అని అర్థం. నిజానికి, మెదడులో శీతాకాలంలో మాదిరి పొగమంచు ఉంటుందని దాని అర్ధం కాదు. మెదడుకు ఓ ముసుగులాంటిది అడ్డుపడుతుందని అర్ధం.

బ్రెయిన్ ఫాగ్ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రభావితం అవుతున్నారు. ఇలా ఉంటే జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. మాట్లాడటంలో స్పష్టత ఉండదు. నిర్ణయాలు ఆలస్యంగా తీసుకుంటారు. అలసటగా అనిపిస్తుంది. పని మీద ఏకాగ్రత పెట్టడం కష్టంగా మారుతుంది.

మెదడు పొగమంచు వదిలించుకోవటం ఎలా? అనే ప్రశ్నకు సమాధానం నిద్ర మాత్రమే. అవును నిద్రకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ చూసే అలవాటు మానేయాలి.

అలాగే బ్రెయిన్ ఫాగ్ నుంచి బయటపడటానికి వ్యాయామం చాలా అవసరం. ఇది మెదడు కణాలను తాజాగా ఉంచుతుంది. యాక్టివేట్ చేయబడతాయి. వ్యాయామం చేయడం వల్ల శరీరం తేలికగా మారుతుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. బ్రెయిన్ ఫాగ్ నుండి బయటపడాలంటే, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం పూర్తిగా మానేయాలి. కూరగాయలు, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.




