AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్, మటన్ తింటే నిద్ర ఎందుకు వస్తుంది..? ఓర్నాయనో.. అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారం తీసుకున్నప్పుడు సాధారణంగా నిద్ర, మగత వస్తుంది.. మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల శరీరంలోని శక్తి, ప్రాణవాయువు జీర్ణక్రియకే మళ్లిపోతాయి. ఇది నిద్ర, మగత, బద్ధకానికి దారితీస్తుందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..

చికెన్, మటన్ తింటే నిద్ర ఎందుకు వస్తుంది..? ఓర్నాయనో.. అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే
Chicken
Shaik Madar Saheb
|

Updated on: Feb 06, 2026 | 3:22 PM

Share

చికెన్.. మటన్.. ఫిష్.. అబ్బ.. మాంసాహారులకు పండగే పండగ.. నాన్‌వెజ్ ఇష్టపడే వారి ముక్క లేకుండా ముద్దదిగదు.. ఫ్రై, కూర.. ఇలా ఇష్టంగా పలు రకాలు గా వండుకుని తింటారు.. అయితే.. చికెన్, మటన్ వంటి మాంసాహారం తినడం వల్ల నిద్ర, మగత ఎందుకు వస్తుందో అన్న విషయాన్ని ఎప్పుడైనా గమనించారా..? అవును.. మాంసాహారం తిన్న తర్వాత.. బాగా నిద్ర వస్తుంది.. కొంతమంది ప్రతిరోజు మాంసాహారాన్ని తింటారు.. మరికొందరు వారానికి ఒకటి నుండి మూడు సార్లు తీసుకుంటారు.. అయితే.. నాన్ వెజ్ ఆహారానికి, మత్తుకు, మగతకు చాలా దగ్గర సంబంధం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు వంటి శాఖాహారం జీర్ణం కావడానికి 3-4 గంటల సమయం పడుతుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్నా కూడా గరిష్టంగా 6 గంటల్లో జీర్ణం అవుతాయి. అయితే, మాంసాహారం జీర్ణం కావడానికి 7 నుండి 10 గంటల వరకు సమయం పడుతుంది. బాగా వేయించిన, గట్టి మాంసాహారం అయితే 10 గంటల వరకు కూడా పట్టవచ్చు. జీర్ణక్రియకు పట్టే ఈ రెట్టింపు సమయం నిద్ర, మగతకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.

మాంసాహారంలోని పోషకాలు..

చికెన్, మటన్, ఫిష్ వంటి మాంసాహారాలు తిన్న తర్వాత నిద్రమత్తు రావడానికి ప్రధాన కారణం వాటిలో ఉండే అధిక ప్రోటీన్, ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం.. ఇది సెరోటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేసి నిద్రను ప్రేరేపిస్తాయి. అలాగే, భారీ ఆహారం జీర్ణం కావడానికి శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగించడం వల్ల అలసట కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మాంసాహారం కడుపులోకి వెళ్లిన తర్వాత, దానిని అరిగించడానికి శరీరం అధిక శక్తిని వినియోగిస్తుంది. దాదాపు 60% శక్తి, 40-50% ప్రాణవాయువు, 60-70% రక్తం జీర్ణవ్యవస్థకు మళ్లిపోతాయి. ఇది మెదడుకు, ఇతర శరీర భాగాలకు అందే శక్తిని తగ్గిస్తుంది.. తద్వారా మత్తుగా, బద్ధకంగా, మగతగా అనిపిస్తుందని పేర్కొంటున్నారు నిపుణులు.. అయితే.. నాన్ వెజ్ తిన్న తర్వాత అందుకే.. నిద్ర వస్తుందని పేర్కొంటున్నారు.

మితంగా తిని..

అయితే.. నిద్ర రాకూడదనకుంటే.. మితంగా తినాలంటున్నారు డైటీషియన్లు.. మాంసాహారంతో పాటు కూరగాయలు, సలాడ్లు తీసుకోవాలి. ఇంకా తిన్న వెంటనే పడుకోకుండా కొద్దిసేపు నడవాలని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..