Health Tips: రోజూ 5 నిమిషాలు ఇలా చేస్తే.. ఆ సమస్యలకు చూమంత్రి వేసినట్టే..
ఇటీవల కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో గుండె జబ్బు కూడా ఒకటి. ఇది ప్రధానంగా అధిక కర్తపోటు కారణంగా వచ్చే వ్యాధి. మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాంలంటే కర్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. కాబట్టి రక్తపోటును నియంత్రించడంతో పాటు మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యానికి రక్తపోటును నిర్వహించడం చాలా ముఖ్యం. అధిక రక్తపోటు అనేది గుండె జబ్బులు, స్ట్రోక్, అకాల మరణం వంటి తీవ్రమైన పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని నివేదికల ప్రకారం, USలో సగం కంటే ఎక్కువ మంది వయస్సు మల్లిన వారు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడమనేది ఎంతో ముఖ్యం. ఇందుకోసం మన నిత్య జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. రన్నింట్ లేదా సైక్లింగ్ వంటి వ్యాయామం రోజుకు ఐదు నిమిషాలు చేయడం వల్ల సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటు తగ్గుతుందని ఇటీవలి అధ్యయనం తెలిపింది.
అధ్యయనంలో కీలక విషయాలు
రోజుకు ఐదు నిమిషాల వ్యాయామం వంటి రోజువారీ కార్యకలాపాలు కూడా రక్తపోటును గణనీయంగా మెరుగుపరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అధ్యయనంలో భాగంగా 14,761 మందిపై పరిశోధకులు ప్రయోగం జరిపారు. రోజంతా వారి కార్యాచరణ స్థాయిలను పర్యవేక్షించడానికి వారికి మోషన్ ట్రాకర్ల ఏర్పాటు చేసి డేటాను విశ్లేషించారు. అప్పుడు రోజూ వ్యాయామం చేసే వారిలో రక్తపోటు రీడింగులు తగ్గినట్టు గుర్తించారు. అయితే నిశ్చల జీవనశైలి రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉంటుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏం చేయాలి
పరుగు, సైక్లింగ్, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామ కార్యకలాపాలను పెంచడం వల్ల రక్తపోటు తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రోజుకు 21 నిమిషాల సమయాన్ని వర్కౌట్ కోసం కేటాయిస్తే.. వారి శరీరంలో సిస్టోలిక్ రక్తపోటు దాదాపు 2 mmHg తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. కేవలం పరుగు, సైక్లింగ్, మెట్లు ఎక్కడమే కాకుండా ఇతర అలవాట్లు కూడా మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని పరిశోదకులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




