AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri: నవరాత్రులలో ఇంటిని ఇలా అలంకరించండి.. అధ్యత్మికతో పాటు స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటుంది

దసరా ఉత్సవాలకు ముందు ఇంటిని శుభ్రం చేసుకుంటారు. దుర్గాదేవిని పూజించడానికి ముందు ఇంటిని, పూజ గదిని అందంగా అలంకరించుకుంటారు. సరాఫ్ ఫర్నీచర్ CEO, వ్యవస్థాపకుడు రఘునందన్ సరాఫ్ మాట్లాడుతూ నవరాత్రులలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిని అందంగా అలంకరించుకోవాలని.. ఆ అలంకరణ బాగుండాలని కోరుకుంటారు. పండగ సమయంలో అందమైన వాతావరణం ఉంటుంది.

Navratri: నవరాత్రులలో ఇంటిని ఇలా అలంకరించండి.. అధ్యత్మికతో పాటు స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటుంది
Navratri Decoration Ideas
Surya Kala
|

Updated on: Oct 02, 2024 | 3:59 PM

Share

దేవీ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3వ తేదీ గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ పండుగ హిందువులకు చాలా ప్రత్యేకమైనది. తొమ్మిది రోజుల పాటు జరుపుకునే నవరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారిని నిండు మనసుతో పూజిస్తారు. దసరా ఉత్సవాలకు ముందు ఇంటిని శుభ్రం చేసుకుంటారు. దుర్గాదేవిని పూజించడానికి ముందు ఇంటిని, పూజ గదిని అందంగా అలంకరించుకుంటారు. సరాఫ్ ఫర్నీచర్ CEO, వ్యవస్థాపకుడు రఘునందన్ సరాఫ్ మాట్లాడుతూ నవరాత్రులలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిని అందంగా అలంకరించుకోవాలని.. ఆ అలంకరణ బాగుండాలని కోరుకుంటారు. పండగ సమయంలో అందమైన వాతావరణం ఉంటుంది. దేవీ నవరాత్రి నుంచి దీపావళి వరకు నెల పొడవునా ఏదో ఒక పండుగ, పర్వదినాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఇంటి అలంకరణ కూడా ప్రత్యేకంగా ఉండాలి. పండుగల సమయంలో ఇంటి రూపురేఖలను ఎలా అందంగా మార్చుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం..

ఫెయిరీ లైట్లు

ఇంటి అలంకరణకు ఫెయిరీ లైట్లు బెస్ట్ ఎంపిక. ఈ విద్యుత్ దీపాలతో అందంగా ఇంటిని అలంకరించడంతో ఇంటి లుక్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇంటిలోని పూజ గదిలో ఫెయిరీ లైట్లు అమర్చండి. ఇంటి తలుపు వద్ద అద్భుత దీపాలను కూడా ఉపయోగించవచ్చు. ఫెయిరీ లైట్లు ఇల్లు నక్షత్రాల్లా మెరిసేలా చేస్తాయి.

తోరణాలు,

గుమ్మాలకు మామిడి తోరణాలు లేదా డోర్ కర్టెన్లు భారతీయ అలంకరణలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడతాయి. ముఖ్యంగా పండుగల సమయంలో హిందువులు తమ ఇంటి గుమ్మాలకు తోరణాలతో అందంగా అలంకరిస్తారు. అయితే ఇంటికి మోడ్రన్ టచ్ ఇచ్చే ఆర్చ్ నే ఎంచుకోవాలి. మామిడి ఆకులు, అశోక ఆకులతో పాటు జనపనార, టెర్రకోట లేదా మెరిసే కాగితాన్ని ఉపయోగించి తోరణాలను తయారు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పూల రంగోలి

దేవీ నవరాత్రి సమయంలో ఇంటి అలంకరణ రంగోలీ లేకుండా పూర్తి కాదు. నవరాత్రులలో ఇంటికి సాంప్రదాయ రూపాన్ని ఇవ్వడానికి పువ్వులు, ఆకులు, బియ్యానికి రంగులు వేసి రంగోలీని తయారు చేయవచ్చు. సాయంత్రం వేళల్లో రంగోలి అందాన్ని మరింత పెంచేందుకు రంగోలి చుట్టూ దీపాలతో అలంకరించండి.

దీపాలతో అలంకరించండి

కావాలంటే ఇంటిని కూడా దీపాలతో అలంకరించుకోవచ్చు. దీని కోసం మార్కెట్ నుండి స్ట్రింగ్ ల్యాంప్స్ కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు పొడవైన కృత్రిమ పువ్వులు, షెల్లు, పూసల సహాయంతో తలుపులను అలంకరించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..