Glowing Skin: సమ్మర్‌లో ఫేస్ నల్ల బడుతుందా.. ఈ ఒక్క ఫేస్‌ప్యాక్‌తో క్షణాల్లో మెరిసేలా చేయండి!
సమ్మర్‌లో కాసేపు బయటకు వెళ్లి వచ్చినా ఫేస్ మొత్తం నల్లగా మారిపోతుంది. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే అతినీలాలోహిత కిరణాలు, బయట ఉండే కాలుష్యం, దుమ్ము, దూలి కారణంగా మన చర్మం మొత్తం పాడవుతుంది. అలాగే చర్మం డల్‌గా మారుతుంది. మళ్లీ చర్మ నిగారింపును పెంచుకునేందుకు జనాలు కరీదైన క్రీములు వాడుతూ ఉంటారు. కానీ ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో ఈజీగా చర్మ నిరాగింపును పెంచుకోవచ్చని చాలా మందికి తెలియదు అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో సన్‌స్ర్రీన్ లేకుండా బయటకు వెళ్తే అంతే ఇక.. మళ్లీ మనం ఇంటికొచ్చేలోపు మనల్ని మనమే గుర్తు పట్టలేక పోతాం. అంతలా మన ముఖంపై దుమ్మూ, దూలి పేరుకుపోయి ఫేస్ మొత్తం నల్లగా మారుతుంది. ఈ క్రమంలో మన చర్మాన్ని ఆరోగ్యంగా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందకోసం బయట దొరికే రసాయనాలతో తయారు చేసే క్రీములు వాడడం కన్నా సహజంగా ఇంట్లో దొరికే వస్తువులతో చర్మ నిగారింపును పెంచుకోవడం మంచింది. కాబట్టి ఇంట్లో దొరికే చందనం పొడి, పసుపు, కాఫీ, పాలతో మీ చర్మ కాంతిని సులభంగా ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.
గందం పొడి ఫేస్ ప్యాక్ ప్రయోజనాలు
చందనం చర్మానికి ఉపశమనం కలిగించి, ఎండదెబ్బ నుండి ఉపశమనం అందిస్తుంది. కాఫీ ఒక అద్భుతమైన ఎక్స్‌ఫోలియేటర్, ఇది చర్మ రంధ్రాలను లోతుగా శుభ్రపరుస్తుంది. పసుపులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు, పాలలోని లాక్టిక్ యాసిడ్ కలిసి మచ్చలను తేలికపరిచి, మీ చర్మాన్ని పట్టులా మృదువుగా చేస్తాయి. కాబట్టి, ఈ వేసవిలో మీ చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి ఈ పదార్థాలతో చేసిన ఫేస్ ప్యాక్‌ను మీరు ఉపయోగించవచ్చు.
గంధపు పొడి ఫేస్ ప్యాక్‌కు కవాల్సిన పదార్థాలు
- 1 టేబుల్ స్పూన్ గందం పొండి
- 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి
- చిటికెడు కస్తూరి పసుపు
- 1-2 టేబుల్ స్పూన్లు పచ్చి పాలు
గంధపు పొడి ఫేస్ ప్యాక్ తయారీ విధానం
ఒక శుభ్రమైన గాజు గిన్నెలో గంధపు పొడి, కాఫీ పొడిని వేసి బాగా కలపండి. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు పొడి వేసి మరోసారి బాగా కలపండి. ఈ క్రమంగా పచ్చి పాలను పోస్తూ, నునుపైన చిక్కటి పేస్ట్ ఏర్పడే వరకు గిలకొట్టండి. మిశ్రమంలో ఉండలు లేకుండా చూసుకోండి.
ఈ ఫేస్ ప్యాక్ ఎలా ఉపయోగించాలి
ముందుగా మీ ముఖాన్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి, తద్వారా మురికి అంతా తొలగిపోతుంది. ఇప్పుడు మీరు ముందుగానే తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్‌ను బ్రష్ లేదా వేళ్ల సహాయంతో ముఖం, మెడ అంతటా సమానంగా అప్లై చేసేకోండి. సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత, మీ చేతులను కొద్దిగా తడిపి, చల్లటి నీటితో ఫేస్ మొత్తం రుద్దుతూ నెమ్మదిగా కడగండి. చివరగా, మీ ముఖాన్ని తడి లేకుండా తుడుచుకొని.. తేలికపాటి మాయిశ్చరైజర్‌ను రాయండి. మీ ఫేస్‌లో గ్లో పెరిగి, చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే వారిని రెండు సార్లు ఇలా చేయండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
