Weather Alert: అబ్బ.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం వేళల్లో ఎండలు మండిపోతున్నాయి.. సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ క్రమంలోనే.. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం వేళల్లో ఎండలు మండిపోతున్నాయి.. సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ క్రమంలోనే.. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి, ద్రోణి/గాలి అంతరాయం ఈ రోజు పశ్చిమ విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు, మరాఠ్వాడ, అంతర కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. అలాగే.. తూర్పు గాలుల ద్రోణి, కొమొరిన్ ప్రాంతం నుండి తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, దక్షిణ అంతర కర్ణాటక మీదుగా ఉత్తర అంతర కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నది.
రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనము ఈ రోజు బలహీనపడినది./ తక్కువగా గుర్తించబడినది. అంతేకాకుండా దక్షిణ అంతర కర్ణాటక, పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనము ఈ రోజు బలహీనపడినది లేదా తక్కువగా గుర్తించబడినది. ఆంధ్రప్రదేశ్ – యానాంపై దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ / పశ్చిమ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-
సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30- 40 కిలోమీటర్లు వేగంతో వీస్తాయి.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30- 40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
రాయలసీమ :-
సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30- 40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి
గమనిక :- కోస్తా ఆంధ్ర ప్రదేశ్ – యానాం, రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.
తెలంగాణలో రాగల 3 రోజులకు వాతావరణ సూచన:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. సోమవారం, మంగళవారం, బుధవారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.
ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
