కాకినాడ జిల్లా కరపలో శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో విగ్రహానికి చెమటలు పట్టిన అద్భుతం చోటుచేసుకుంది. ఈ వార్తతో 5,000 మంది మహిళా భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. భక్తుల కోరికలు తీర్చేందుకే అమ్మవారు ఈ అద్భుతం చూపారని ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు తెలిపారు. ఇది కాశీ వారాహి అమ్మవారి రెండో ప్రతిరూపంగా భక్తులు నమ్ముతున్నారు.