AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Cards: రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే.. ప్రతీఒక్కరికీ..

రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో కొత్త రేషన్ షాపులను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అలాగే మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టారు.

Ration Cards: రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే.. ప్రతీఒక్కరికీ..
Ration Card
Venkatrao Lella
|

Updated on: Mar 30, 2026 | 2:38 PM

Share

తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్ అందించింది. వచ్చే నెలలో కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మంత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్‌లో కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేయనున్నామని, దీని వల్ల రేషన్ సరుకుల సరఫరాలో వేగం పెరుగుతుందని తెలిపారు. వీటితో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు.

ఒకేసారి మూడు నెలల రేషన్

ఇక రేషన్ కార్డుదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త అందించాయి. ఎండలు తీవ్రతరం అవుతున్న క్రమంలో ఒకేసారి మూడు నెలల రేషన్‌ను లబ్దిదారులకు అందించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్‌లోనే మూడు నెలలకు సంబంధించి రేషన్ కోటాను ఒకేసారి కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్‌ను ఏప్రిల్‌ నెలలో ఒకేసారి అందిస్తారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి రేషన్ షాపులకు పీడీఎస్ బియ్యం సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం రేషన్ కార్డులోని ప్రతీ సభ్యుడికి నెలకు 6 కిలోల సన్నబియ్యం అందిస్తున్నారు. ఒకేసారి మూడు నెలల కోటా పంపిణీ చేస్తున్నందున 18 కిలోల చొప్పున అందించాల్సి ఉంటుంది. ఒకేసారి మూడు నెలల రేషన్ అందుతుండటంతో ఇది రేషన్ కార్డుదారులకు శుభవార్తగా చెప్పవచ్చు.

సాఫ్ట్‌వేర్‌లో మార్పులు

ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే 72 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఐదుగురు సభ్యులు ఉంటే 90 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అంత్యోదయ కార్డు కలిగి ఉన్నవారికి నెలకు 35 కిలోల చొప్పున అందిస్తారు. అంటే మూడు నెలలకు 105 కిలోలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులో ఉండటం వల్ల లబ్దిదారులు సమీపంలోని రేషన్ షాపుల్లో ఎక్కడైనా రేషన్ పొందవచ్చు. ఇక ఒకేసారి మూడు నెలల బియ్యం అందిస్తుండటంతో బయోమెట్రిక్ మెషిన్ల సాఫ్ట్ వేర్ అప్డేట్ చేస్తున్నారు. ఒకేసారి మూడు నెలల వేలిముద్ర వేసేలా మెషిన్లలో మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే మూడు నెలల స్టాక్ అందుబాటులో ఉంచేందుకు రేషన్ దుకాణాల్లో స్థలం సరిపోడం లేదు. రేషన్ దుకాణాలు చిన్న చిన్న మడిగెల్లో నిర్వహిస్తున్నారు. వందల క్వింటాళ్ల బియ్యాన్ని స్టాక్ చేసేంత స్థలం ఉండటం లేదు. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా డీలర్లకు సరఫరా చేయలని పౌరసరఫరాల శాఖ అధికారులు సన్నద్దమవుతున్నారు.

Follow Us