AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఫోటో చూస్తే మీ కళ్లు మోసం చేస్తాయ్.. అసలు పే..ద్ద కథ తెలిస్తే బిత్తరపోతారు

బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలించిన ‘ఓజీ కుష్’ అనే హైబ్రిడ్ గంజాయిని ముషీరాబాద్‌లో ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.36 లక్షల విలువైన ఈ మత్తు పదార్థాన్ని విక్రయిస్తున్న రాహుల్ సింగ్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: ఫోటో చూస్తే మీ కళ్లు మోసం చేస్తాయ్.. అసలు పే..ద్ద కథ తెలిస్తే బిత్తరపోతారు
Telugu News
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Apr 22, 2026 | 8:15 PM

Share

హైదరాబాద్ నగరంలో మత్తు పదార్థాల విక్రయాలు మరోసారి కలకలం రేపాయి. విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో డ్రగ్స్ దిగుమతి చేసుకుని, ఇక్కడ విక్రయిస్తున్న ముఠా గుట్టును ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. బ్యాంకాక్ నుంచి స్మగ్లింగ్ చేసిన ఖరీదైన హైబ్రిడ్ గంజాయి ‘ఓజీ కుష్’ను ముషీరాబాద్‌ పరిధిలో పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ముషీరాబాద్ ప్రాంతంలోని నామాలగుండు వద్ద మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. సీఐ రామకృష్ణ, ఎస్సై శ్రావణ్ నేతృత్వంలోని బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 29 ఏళ్ల రాహుల్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు, అతని వద్ద నుంచి 1.311 కిలోల అత్యంత ఖరీదైన ‘ఓజీ కుష్’ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.36 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నిందితుడు రాహుల్ సింగ్‌ను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంజాత్ సింగ్ అనే వ్యక్తి ఈ హైబ్రిడ్ గంజాయిని బ్యాంకాక్ నుంచి అక్రమంగా తెప్పించి రాహుల్‌కు అప్పగిస్తాడని తెలిసింది. ప్రస్తుతం ఇంజాత్ సింగ్ ఇతర కేసుల్లో జైలులో ఉండగా, అతని ఆదేశాల మేరకు రాహుల్ నగరంలో ఈ మత్తు పదార్థాలను విక్రయిస్తున్నాడు. సామాన్యులకు అందని ధరలో ఉండే ఈ రకం గంజాయిని సంపన్న వర్గాలను లక్ష్యంగా చేసుకుని అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసుల కళ్లు గప్పి విదేశాల నుంచి ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ ఎలా వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. యువత ఇలాంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే చాలు ఇంటికి తిరిగొస్తాయ్..

Follow Us
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా
తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?
తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?