Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ కార్మికుల సమ్మె వేళ మెట్రో కీలక నిర్ణయం..
టీజీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమంలో హైదరాబాద్ ప్రజలకు మెట్రో శుభవార్త అందించింది. నగరంలో మెట్రో సర్వీసుల సంఖ్యను మరింత పెంచింది. ప్రతీ మూడు నిమిషాలకు ఒక మెట్రో సర్వీస్ తిప్పనున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల బంద్ క్రమంలో మెట్రోకు డిమాండ్ పెరిగింది.

తెలంగాణలో టీజీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమంలో బస్సులన్నీ బంద్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నీ డిపోల్లోనే నిలిచిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులకు మెట్రో గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీ బస్సు సర్వీసులు నిచిపోయిన క్రమంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మెట్రో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అదనపు మెట్రో సర్వీసులను ప్రవేశపెట్టింది. మెట్రో సర్వీసుల సంఖ్యను మరింత పెంచింది. నాగోల్ టు రాయదుర్గం రూట్లో ప్రతీ 3 నిమిషాల 40 సెకన్లకు మెట్రో రైలు తిప్పనుండగా.. మియాపూర్ టూ ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాలకు ఒక మెట్రో సర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఈ అదనపు మెట్రో సర్వీసులను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని మెట్రో వర్గాలు సూచించాయి.
మెట్రోలో పెరిగిన ప్రయాణికుల రద్దీ
ఆర్టీసీ బస్సులు నిలిచిపోయిన క్రమంలో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. నగర నలుమూలకు ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎంఎంటీఎస్ రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. ఇక మెట్రో రైళ్లల్లో కూడా ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. ఆర్టీసీ బస్సు లేకపోవడంతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పనుల కోసం వెళ్లే కూలీలు అవస్థలు పడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ బస్సులు, ఆటోల నిర్వహకులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యులపై భారం పడుతోంది. ఆర్టీసీ సమ్మె ప్రభావం హైదరాబాద్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. నగరంలో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆఫీసులకు వెళ్లేవారు, పనుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి రవాణా సౌకర్య లేక ప్రైవేట్ క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. మెట్రో నగరంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉంది. మెట్రో సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాలకు వెళ్లాలంటే ఆటోలు, క్యాబ్‌లే దిక్కు. బస్సులు లేకపోవంతో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు.
సమ్మె విరమించండి..
ఇక సమ్మెను వెంటనే విరమించాలని జేఏసీ నేతలను రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. సమ్మె చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, సమ్మెను విరమించుకోవాలని కోరారు. ఇక టీజీఎస్‌ఆర్టీసీ అద్దె బస్సులను నడుపుతుండగా.. ఇందులో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద జీరో టికెట్ జారీ చేయడం లేదు. దీంతో ఉచిత ప్రయాణ సౌకర్యానికి మహిళలు దూరమవుతున్నారు. దీంతో మహిళలు ఛార్జీలు పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. అయితే సమ్మె ఎన్నిరోజుల పాటు జరుగుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
