కూరల్లో ఉప్పు ఎక్కువైందా? ఈ చిన్న పని చేస్తే టెస్ట్ అదిరిపోద్ది
30 March 2026
TV9 Telugu
TV9 Telugu
ఒక్కోసారి అనుకోకుండా కూరల్లో ఉప్పు ఎక్కువగా పడిపోతుంది. ఈ పొరపాటు అప్పుడప్పుడు ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది. అలా ఎక్కువైన ఉప్పును వెనక్కి తీయలేకపోయినా దాని వల్ల కూర రుచి చెడిపోకుండా మాత్రం జాగ్రత్త పడవచ్చు
TV9 Telugu
కూరల్లో పొరపాటున ఉప్పు ఎక్కువగా పడితే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది నిమ్మరసం. కూరల్లో దీన్ని కలపడం వల్ల ఉప్పు తగ్గుతుంది. ముఖ్యంగా మాంసాహార వంటలు చాలా రుచిగా ఉంటాయి
TV9 Telugu
కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు దానికి కొద్దిగా కొబ్బరిపాలు, లేదా పేస్టు కలపాలి. ఇలా చేడయం వల్ల కూరల్లో ఉప్పదనం తగ్గి రుచికరంగా ఉంటుంది
TV9 Telugu
పచ్చి బంగాళదుంప తొక్క తీసి, నాలుగు ముక్కలుగా కోసి కూరలో వేయాలి. వీటిని దాదాపు 10 నిమిషాల పాటు అందులో ఉడకనిస్తే ఆ ముక్కలు ఉప్పును పీల్చుకుంటాయి
TV9 Telugu
అయితే వడ్డించే ముందు ఉడికిన బంగాళాదుంపలను కూరలోంచి బయటకు తీసేయాలి. కూరలో ఉప్పు ఎక్కువగా పడితే రెండు లేదా మూడు కప్పుల పెరుగును కూరలో కలపడం వల్ల ఉప్పు తగ్గుతుంది
TV9 Telugu
అంతేకాదు వంటలు కూడా చాలా రుచిగా ఉంటాయి. పెరుగు ఇష్టపడని వారు దానికి బదులుగా మీగడ కలుపుకోవచ్చు. కూర పరిమాణాన్ని బట్టి ఒకటి లేదా రెండు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, నూనెలో వేయించి కూరలో కలపడం వల్ల ఉప్పదనం తగ్గుతుంది. రుచి పెరుగుతుంది
TV9 Telugu
గోధుమ పిండికి కొద్దిగా నీటిని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, వీటిని కూరలో వేసి 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇవి కూరలో ఎక్కువగా ఉన్న ఉప్పును గ్రహించేస్తాయి. తర్వాత వీటిని బయటకు తీసేయొచ్చు
TV9 Telugu
చేసిన వంటకాన్ని బట్టి టమాట ముక్కలు లేదా పేస్టును జత చేయవచ్చు. అప్పటికే కూరలో ఉల్లిపాయ, టమాట పేస్టు వేసినప్పటికీ మరికొంత అదనంగా కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూరలో ఉప్పు తగ్గుతుంది, రుచీ పెరుగుతుంది. ఒక వేళ కూరలో తక్కువ నీళ్లు ఉంటే కనుక ఇంకా కొన్ని నీళ్లు లేదా పాలు పోసి ఉడికిస్తే సరిపోతుంది