బెంగళూరులో ఓ ప్రొఫెసర్ తన విద్యార్థి అఫాన్ను క్లాస్‌లో దాదాపు 60 మంది ముందు 13 సార్లు టెర్రరిస్ట్ అని సంబోధించారు. ఇరాన్ యుద్ధానికి విద్యార్థిలాంటి వారే కారణమని, ట్రంప్ వచ్చి తీసుకెళ్తాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో యూనివర్సిటీ యాజమాన్యం ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసింది. అంతర్గత విచారణ కొనసాగుతోంది.