AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్ బయట అంత కల్తీనే! ఇంట్లోనే కమ్మని స్వచ్ఛమైన పెరుగును ఇలా తయారు చేసుకోండి

సమ్మర్‌ పెరుగు తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. ఎందుకంటే ఇది బాడీని కూల్‌ చేస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ గాళ్లు ఎక్కువైపోయారు. కాసుల కోసం కక్కుర్తి పడి ప్రతి దాన్ని కల్తీ చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్‌లో దొరికే ప్యాకెట్ పెరుగు పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. కాబట్టి షాప్‌లకు వెళ్లే పనిలేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన గడ్డ పెరుగును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బాబోయ్ బయట అంత కల్తీనే! ఇంట్లోనే కమ్మని స్వచ్ఛమైన పెరుగును ఇలా తయారు చేసుకోండి
Homemade Curd
Anand T
|

Updated on: Mar 30, 2026 | 12:50 PM

Share

మన ముందు ఎన్ని కూరగాయలు ఉన్నా.. చివరికి పెరుగుతో తినకపోతే.. ఆ భోజనం అసంతృప్తిగానే ఉంటుంది. ఎందుకంటే పెరుగు ఉండే టేస్ట్ అలాంటి. రుచి మాత్రమే కాదు పెరుగుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యం వేసవిలో పెరుగు తినేందుకు జనాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సమ్మర్‌లో మండే ఎండల నుంచి ఈ పెరుగు మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. శరీరాన్ని కూల్‌ చేస్తుంది. బయట షాప్‌లో దొరికే పెరుగుకు బదులు ఇంట్లోనే మనం పెరుగును తయారు చేసుకొని తింటే ఆ రుచి వేరే ఉంటుంది. కాబట్టి కల్తీకి చెక్‌ పెడుతూ ఇంట్లోనే స్వచ్చమైన గడ్డ పెరుగును 15 నిమిషాల్లో ఎలా రెడీ చేసుకోవాలో స్టెప్‌ బై స్టెప్ తెలుసుకుందాం.

గడ్డ పెరుగును ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి

పాలను మరిగించడం: పెరుగు తయారు చేసుకోవడానికి మనకు పాలు అవసరం. ఇందుకోసం సుమారు అర లీటరు పాలు తీసుకుని, దానిని 3-4 నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించండి. దీని వల్ల పాలలోని నీరు తొలగిపోయి చిక్కటి పాలు రెడీ అవుతాయి. వాటిని స్టవ్‌ మీద నుంచి కిందకు దించి చల్లారే వరకు అలాగే ఉంచండి.

తోడు వేయడం: అయితే మీరు ఇప్పటికే మరిగించి చల్లార్చిన పాలను ఒక శుభ్రమైన బౌల్‌లో పోసుకొని అందులో కాస్త పెరుగు వేసి బాగా కలపండి. పెరుగు మంచి గడ్డకట్టాలంటే మీరు దాన్ని బాగా కలపడం ముఖ్యం. అయితే పెరుగు మీకు మంచిగా రావాలంటే మట్టి కుండలో తోడు వేయడం ఇంకా ఉత్తమం.

కలపడం: తోడు వేసిన తర్వాత పాలను స్పూన్‌తో బాగా కలపాలి. లేదా ఒక గిన్నె నుండి మరో గిన్నెలోకి రెండు సార్లు పాలను వడపోయండి. ఇలా చేయడం ద్వారా తోడు పాలన్నింటికీ సమానంగా పడుతుంది. తర్వాత గిన్నెపై మూత పెట్టి, కదపకుండా ఒక పక్కన ఉంచాలి. మీకు పెరుగు పుల్లగా ఉండకూడదంటే తాజా పెరుగుతో తోడు వేయండి.

ఇది ఎండాకాలం కాబట్టి కేవలం 4 నుండి 6 గంటల్లో పెరుగు రెడీ అవుతుంది. అదే చలి కాలంలో అయితే పెరుగు గట్టకట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఓక వేళ మీ దగ్గర తోడు పెరుగు లేకపోతే, రెండు ఎండుమిర్చిలను గోరువెచ్చని పాలలో వేసి మూత పెడితే కూడా పెరుగు తయారవుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బాబోయ్ బయట అంత కల్తీనే! ఇంట్లోనే స్వచ్ఛమైన పెరుగును ఇలా చేసుకోండి
బాబోయ్ బయట అంత కల్తీనే! ఇంట్లోనే స్వచ్ఛమైన పెరుగును ఇలా చేసుకోండి
టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు..
టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు..
కేకేఆర్ ఓటమికి అసలు కారణం ఇదేనా? ఐపీఎల్‌లో కొత్త వివాదం
కేకేఆర్ ఓటమికి అసలు కారణం ఇదేనా? ఐపీఎల్‌లో కొత్త వివాదం
యుద్ధ సెగతో వణికిపోతున్న అగ్రరాజ్యం.. 3 వారాల్లో వేల కోట్ల నష్టం
యుద్ధ సెగతో వణికిపోతున్న అగ్రరాజ్యం.. 3 వారాల్లో వేల కోట్ల నష్టం
రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే
రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. 4గంటల్లోనే భారీగా తగ్గిన ధరలు.
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. 4గంటల్లోనే భారీగా తగ్గిన ధరలు.
తక్కువ బడ్జెట్‌లో ఇన్వర్టర్‌పై పనిచేసే టాప్ ఎయిర్ కూలర్లు ఇవే!
తక్కువ బడ్జెట్‌లో ఇన్వర్టర్‌పై పనిచేసే టాప్ ఎయిర్ కూలర్లు ఇవే!
పువ్వులు ఇలా నిల్వ చేస్తే.. ఎక్కువ రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి..
పువ్వులు ఇలా నిల్వ చేస్తే.. ఎక్కువ రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి..
రెండు చోట్ల పోటీ వెనుక రీజన్ ఇదే.. విజయ్ పెద్ద స్కెచ్చే వేశారుగా
రెండు చోట్ల పోటీ వెనుక రీజన్ ఇదే.. విజయ్ పెద్ద స్కెచ్చే వేశారుగా
మండే ఎండల్లో పైనాపిల్‌ జ్యూస్‌ తాగితే ఏమవుతుందో తెలుసా..?
మండే ఎండల్లో పైనాపిల్‌ జ్యూస్‌ తాగితే ఏమవుతుందో తెలుసా..?