AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran-US War: అమెరికాకు చుక్కలు చూపిస్తున్న ఇరాన్.. 3 వారాల్లోనే 26,000 కోట్ల నష్టం.. యుద్ధ సెగతో వణికిపోతున్న అగ్రరాజ్యం!

Iran-US War Military Losses: ఇరాన్‌తో సాగుతున్న పోరులో అమెరికా రక్షణ వ్యవస్థకు భారీ గండి పడింది. అత్యంత ఖరీదైన F-15E జెట్స్ నుండి అడ్వాన్స్‌డ్ రాడార్ సిస్టమ్స్ వరకు అన్నీ దెబ్బతిన్నాయి. ఈ నష్టాల నుండి కోలుకోవడానికి పెంటగాన్ ఏకంగా 200 బిలియన్ డాలర్ల అదనపు బడ్జెట్ కోరుతోంది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో చూడండి!

Iran-US War: అమెరికాకు చుక్కలు చూపిస్తున్న ఇరాన్.. 3 వారాల్లోనే 26,000 కోట్ల నష్టం.. యుద్ధ సెగతో వణికిపోతున్న అగ్రరాజ్యం!
Iran Us War Military Losses
Subhash Goud
|

Updated on: Mar 30, 2026 | 12:31 PM

Share

Iran-US War Military Losses:ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు అగ్రరాజ్యం అమెరికాకు కోలుకోలేని ఆర్థిక, వ్యూహాత్మక దెబ్బ తీస్తున్నాయి. ఇరాన్‌తో సాగుతున్న ఈ ఘర్షణల వల్ల కేవలం మూడు వారాల వ్యవధిలోనే అమెరికా సైన్యం సుమారు 1.4 బిలియన్ డాలర్ల నుండి 2.9 బిలియన్ డాలర్ల వరకు నష్టపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.12,600 కోట్ల నుండి రూ.26,100 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.

పెంటగాన్ అదనపు బడ్జెట్ డిమాండ్:

పెరుగుతున్న నష్టాలను భర్తీ చేసేందుకు, యుద్ధ సన్నద్ధతను కొనసాగించేందుకు పెంటగాన్ ఇప్పుడు వైట్ హౌస్ ముందు 200 బిలియన్ డాలర్ల భారీ అదనపు బడ్జెట్ ప్రతిపాదనను ఉంచేందుకు సిద్ధమవుతోంది. యుద్ధం ఇంకా పూర్తి స్థాయిలో మొదలుకాకముందే ఇంతటి భారీ వ్యయం కావడం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది.

కూలిపోతున్న ఖరీదైన యుద్ధ విమానాలు:

ఈ ఘర్షణల్లో అమెరికా తన అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్‌లను కోల్పోయింది:

ఇవి కూడా చదవండి
  1. F-15E స్ట్రైక్ ఈగిల్: కువైట్‌కు చెందిన విమానం పొరపాటున జరిపిన దాడిలో మూడు F-15E విమానాలు కూలిపోయాయి. ఒక్కో విమానం ధర సుమారు 100 మిలియన్ డాలర్లు (రూ. 900 కోట్లు).
  2. F-35A లైట్నింగ్ II: అధునాతన సాంకేతికత కలిగిన ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. దీనిని తామే కూల్చేశామని ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. దీని విలువ సుమారు 82.5 మిలియన్ డాలర్లు.
  3. డ్రోన్ వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ: అమెరికా నిఘా, దాడి వ్యవస్థలో కీలకమైన MQ-9 రీపర్ డ్రోన్లు ఒక డజనుకు పైగా ధ్వంసమయ్యాయి. ఒక్కో రీపర్ డ్రోన్ ధర కనీసం 16 మిలియన్ డాలర్లు కాగా, అడ్వాన్స్‌డ్ వెర్షన్ల ధర 30 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఇరాన్ మిసైల్ దాడులు వీటిని లక్ష్యంగా చేసుకున్నాయి.
  4. నేలకూలిన ‘ఆకాశ ఇంధన ట్యాంకర్లు: గాలిలో యుద్ధ విమానాలకు ఇంధనం నింపే KC-135 స్ట్రాటోట్యాంకర్లు కూడా ఈ యుద్ధంలో దెబ్బతిన్నాయి.
  5. ఇరాక్ ఆకాశంలో జరిగిన ప్రమాదంలో ఒక ట్యాంకర్ కూలిపోయి ఆరుగురు సైనికులు మరణించారు. సౌదీ అరేబియాలోని ఎయిర్ బేస్ మీద జరిగిన దాడిలో మరో ఐదు విమానాలు దెబ్బతిన్నాయి. వీటి స్థానంలో కొత్తగా కొనే ఒక్కో KC-46 పెగాసస్ విమానం ధర దాదాపు 165 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,485 కోట్లు).
  6. ఖరీదైన రాడార్, డిఫెన్స్ సిస్టమ్స్: అమెరికా రక్షణ కవచం లాంటి వ్యవస్థలు కూడా ఇరాన్ దాడుల నుంచి తప్పించుకోలేకపోయాయి.
  7. THAAD రాడార్: జోర్డాన్‌లో ఉన్న AN/TPY-2 రాడార్ దెబ్బతింది. దీని విలువ 300 మిలియన్ డాలర్ల పైమాటే.
  8. కతర్ రాడార్: కతర్‌లోని అల్-ఉదీద్ ఎయిర్ బేస్‌లో సుమారు 1 బిలియన్ డాలర్ల (రూ. 9,000 కోట్లు) విలువైన అత్యంత అధునాతన రాడార్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు సమాచారం.
  9. నౌకాదళానికీ తప్పని కష్టాలు: మిస్సైల్ దాడులే కాకుండా ఆపరేషనల్ లోపాల వల్ల కూడా అమెరికా నష్టపోతోంది. మార్చి 12న అమెరికా గర్వకారణమైన USS గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ అనే విమాన వాహక నౌకలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రస్తుతం దీనికి గ్రీస్‌లో మరమ్మతులు జరుగుతున్నాయి.

నేరుగా భూతలంపై యుద్ధం ప్రారంభం కాకముందే కేవలం మూడు వారాల్లోనే అమెరికా ఇంతటి భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడటం గమనార్హం. యుద్ధం గనుక ముదిరితే అగ్రరాజ్యానికి ఈ నష్టం ఊహించని రీతిలో పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us