AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bear Attack: అడవిలో ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలి? ఇలా అస్సలు చేయకండి.. ప్రాణాలను కాపాడుకునే మార్గాలివే!

Bear Attack: మీకు ఆకస్మాత్తుగా అడవిలో ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలి? అలాంటి సమయంలో పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి. లేదంటే దానికి ఆహారం అయిపోతారు. ఎలుగుబంటి ఎదురైన సమయంలో ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం..

Bear Attack: అడవిలో ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలి? ఇలా అస్సలు చేయకండి.. ప్రాణాలను కాపాడుకునే మార్గాలివే!
Bear Attack
Subhash Goud
|

Updated on: Mar 30, 2026 | 10:08 AM

Share

Bear Attack: తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఎలుగుబంట్లు సంచరించడం మనం చూస్తూనే ఉంటాం. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలుగుబంట్లు, పులులు చాలా ఉంటాయి. అడవికి వెళ్ళినప్పుడో లేదా పొలాల దగ్గరో అనుకోకుండా ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలి? అంతర్జాతీయ నిపుణుల అధ్యయనాలు, వైల్డ్ లైఫ్ సైంటిస్టుల సూచనల ప్రకారం మనం అనుసరించాల్సిన వ్యూహాలు ఇవే:

1. ఎలుగుబంట్లు ఎందుకు దాడి చేస్తాయి?

చాలామంది ఎలుగుబంట్లు మనుషులను వేటాడి చంపుతాయని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 600కు పైగా దాడులపై జరిగిన అధ్యయనంలో ఎలుగుబంట్లు కేవలం తమను తాము కాపాడుకోవడానికే దాడి చేస్తాయని తేలింది. మనుషులు ఒక్కసారిగా ఎదురుపడినప్పుడు అవి భయాందోళనకు (Shock) గురవుతాయి. ఆ గందరగోళంలోనే అవి ఎదురుదాడికి దిగుతాయి.

2. మీరు వస్తున్నట్లు ముందే తెలియజేయండి

ఎలుగుబంటికి వినికిడి శక్తి ఎక్కువ. మీరు అటువైపు వస్తున్నట్లు దానికి ముందే తెలిస్తే, అది మీ దారికి అడ్డు రాకుండా దూరంగా వెళ్లిపోతుంది. అటవీ ప్రాంతాల్లో నడిచేటప్పుడు గట్టిగా మాట్లాడటం లేదా చప్పట్లు కొట్టడం చేయాలి. అలాగే ఒంటరిగా ఉండొద్దు. గుంపుగా లేదా కనీసం ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్లడం వల్ల ఎలుగుబంట్లు దరిచేరవు.

3. ఎలుగుబంటి ఎదురుపడితే చేయకూడని పనులు

ఒకవేళ అనుకోకుండా ఎలుగుబంటి మీకు అతి సమీపంలోకి వస్తే ఏం చేయాలి? ఆ సమయంలో ఏం తోచదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. భయంతో వణికిపోతుంటాము. అయితే ఎలుగుబంటి ఎదురుపడిఏ కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి. ఒక్కసారిగా పెద్దగా కేకలు వేయకండి. దీనివల్ల అది మరింత గందరగోళానికి గురై దాడి చేయవచ్చు. పరుగెత్తకండి.. ఎలుగుబంటి కంటే వేగంగా మనం పరుగెత్తలేం. మీరు పరుగెత్తితే అది మిమ్మల్ని వేటాడాల్సిన జంతువుగా భావించే ప్రమాదం ఉంది. అంతేకాదు.. దాని కళ్లల్లోకి నేరుగా చూడవద్దు. నేరుగా దాని కళ్లలోకి చూడటం (Eye Contact) దానికి సవాలు విసిరినట్లు అనిపిస్తుంది.

4. అప్రమత్తంగా ఉండాల్సిన సమయాలు

నిద్రపోయే సమయం: ఎలుగుబంట్లు రాత్రిపూట తిరుగుతూ, తెల్లవారుజామున 6 నుండి 7 గంటల ప్రాంతంలో నిద్రకు ఉపక్రమిస్తాయి. ఇదే సమయంలో మనుషులు కూడా వాకింగ్‌కు లేదా పొలాలకు వెళ్తుంటారు కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆడ ఎలుగుబంటి తన పిల్లలతో ఉన్నప్పుడు చాలా దూకుడుగా ఉంటుంది. అలాగే అది ఆహారం తింటున్నప్పుడు దాని దగ్గరకు వెళ్లడం ప్రాణాపాయం. ఆ సమయాల్లో తెగ కోపంగా ఉంటుంది.

5. ఎదురైనప్పుడు చేయాల్సినవి

నిశ్శబ్దంగా వెనక్కి తగ్గండి: ఎలుగుబంటిని చూసినప్పుడు నెమ్మదిగా, వెనక్కి అడుగులు వేస్తూ దూరం పెంచుకోండి. అది వెళ్లేందుకు దారి ఇవ్వండి. మీ వెంట ఎవరైనా ఉంటే అందరూ దగ్గరగా నిలబడండి. మీరు పెద్దగా కనిపిస్తే అది భయపడే అవకాశం ఉంటుంది. ఎలుగుబంటికి మనుషులంటే భయం. కానీ అవి ఎదురు పడితే సంయమనం పాటించాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి ఆవాసాల్లోకి వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈ ఘర్షణలను నివారించవచ్చు.

6. ఎలుగుబంటిని రెచ్చగొట్టొద్దు

పెద్దపెద్ద జంతువులు నివసించే ప్రాంతాల్లో జీవించేటప్పుడు కొన్ని ముప్పులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన అధ్యయనాలు చెబుతున్నాయి. మనుషులు, ఎలుగుబంట్లు ఒకే ప్రాంతాల్లో జీవించేటప్పుడు.. ఎలుగుబంటి దాడుల వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. వీటిపై మనం కచ్చితంగా దృష్టిపెట్టాల్సిందేనని ఇటలీలోని ద సైన్స్ మ్యూజియంలోని హ్యూమన్-వైల్డ్‌లైఫ్ కాన్‌ఫ్లిక్ట్ నిపుణురాలు జియూలియా బాంబీరీ చెప్పారు. 2019లో బాంబేరీ, ఆమెతోపాటు పనిచేసేవారు కలిసి ప్రపంచ వ్యాప్తంగా 600కుపైగా ఎలుగుబంటి దాడులపై అధ్యయనం చేపట్టారు. వీటిలో ఎలుగుబంట్లు ఎక్కువగా ఆత్మరక్షణ కోసమే దాడులు చేస్తాయని తేలింది. ఒక్కసారిగా మనుషులు ఎదురుపడటంతో ఇవి షాక్‌కు గురవుతాయని, ఆ తర్వాత తమను తాము కాపాడుకొనే క్రమంలో దాడులు చేస్తాయని వెల్లడైంది.

గుర్తుంచుకోండి: ఎలుగుబంటిని చూసి ఎప్పుడూ పరుగెత్తకండి. మీరు పరుగెత్తితే అది మిమ్మల్ని వేటాడాల్సిన జంతువుగా భావిస్తుంది. నెమ్మదిగా వెనక్కి అడుగులు వేయడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us