గర్భిణీలు కొబ్బరి నీళ్లు తాగితే బిడ్డకు జుట్టు పెరగదా..?

30 March 2026

TV9 Telugu

TV9 Telugu

గర్భిణులు తినే ఆహారం మీద ఎన్ని అపోహలో. పుచ్చకాయ తింటే పిల్లలకు జలుబు చేస్తుంది అంటారు. కొబ్బరి నీళ్లు తాగితే జుట్టు సరిగా పెరగదు అంటారు

TV9 Telugu

ఆఖరికి చపాతీ తిన్నా వేడిచేస్తుందని మందలిస్తారు. కానీ వీటన్నింటి వల్లా ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఇవి తింటే మొదటి త్రైమాసికంలో వచ్చే చాలా సమస్యలకు చెక్‌ పెట్టేయొచ్చు అంటున్నారు వైద్యులు

TV9 Telugu

కొబ్బరినీళ్లు తాగితే మొదటి మూడునెలల్లో చాలామందికి మార్నింగ్‌ సిక్‌నెస్‌ ఎక్కువగా ఉంటుంది. వాంతులు అవుతూ ఉంటాయి. నీళ్లు తాగినా నిలవవు

TV9 Telugu

దాంతో శరీరాన్ని నిస్సత్తువ ఆవరిస్తుంది. డీహైడ్రేషన్‌ సమస్యలూ ఎక్కువే. ఈ సమయంలో రోజుకి గ్లాస్‌ కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఈ సమస్యలు అన్నింటి నుంచి ఉపశమనం పొందొచ్చు

TV9 Telugu

శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్లు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం వంటి సూక్ష్మపోషకాలు కూడా దీనిలో అధికం

TV9 Telugu

కొబ్బరి బోండాం తాగితే పొట్టలో ఎంత హాయిగా ఉంటుంది. ఇటు ఆరోగ్యం అందించడంతోపాటు ఎలాంటి దుష్ప్రభాలు కలిగించని ఏకైక పానీయం కొబ్బరి నీళ్లు

TV9 Telugu

కొబ్బరి బోండాం నీటిలో అత్యధికంగా కేలరీలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. కాపర్‌ వంటి మినరల్స్‌ ఉండటంతో గుండెకు ఎంతో మంచిది

TV9 Telugu

అంతేకాకుండా కొబ్బరి నీళ్లలో ఉన్న మాంగనీస్ కొవ్వు మెటబాలిజమ్‌, ఎంజైమ్‌ పనితీరు సరిగ్గా ఉండేటట్లు చేస్తుంది. ఈ నీళ్లను తాగడం వల్ల కొలెస్ట్రాల్‌ స్థాయిని అదుపులో ఉంచుతాయి. గుండె జబ్బులకు కారణమైన బెల్లీ ఫ్యాట్‌ను కూడా తగ్గిస్తుంది. అందుకే కొబ్బరి నీళ్లు ప్రతి ఒక్కరికీ మేలు చేస్తాయి