AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : రహానే సంచలన వ్యాఖ్యలు.. కేకేఆర్ ఓటమికి అసలు కారణం ఇదేనా? ఐపీఎల్‌లో కొత్త వివాదం

IPL 2026 : ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని అందించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసి 220 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, ముంబై ఇండియన్స్ బ్యాటర్ల ధాటికి ఆ లక్ష్యం చిన్నబోయింది.

IPL 2026 : రహానే సంచలన వ్యాఖ్యలు.. కేకేఆర్ ఓటమికి అసలు కారణం ఇదేనా? ఐపీఎల్‌లో కొత్త వివాదం
Ajinkya Rahane
Rakesh
|

Updated on: Mar 30, 2026 | 12:35 PM

Share

IPL 2026 : ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని అందించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసి 220 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, ముంబై ఇండియన్స్ బ్యాటర్ల ధాటికి ఆ లక్ష్యం చిన్నబోయింది. రోహిత్ శర్మ విధ్వంసంతో ముంబై మరో 5 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో అందరినీ తొలిచిన ఒకే ఒక ప్రశ్న.. కేకేఆర్ రికార్డు ధర రూ.25.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌తో బౌలింగ్ ఎందుకు చేయించలేదు?

మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ అజింక్య రహానేకు ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి రహానే ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. “గ్రీన్‌తో ఎందుకు బౌలింగ్ చేయించలేదనే విషయం మీరు క్రికెట్ ఆస్ట్రేలియాను అడగాలి” అంటూ రహానే వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి చూస్తుంటే, రాబోయే అంతర్జాతీయ మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని క్రికెట్ ఆస్ట్రేలియా గ్రీన్‌పై ఏవైనా పనిభారం ఆంక్షలు విధించిందా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ గ్రీన్ పూర్తిగా ఫిట్ గా లేకపోతే బ్యాటింగ్ ఎలా చేస్తున్నాడనేది కామెంటేటర్లను సైతం ఆశ్చర్యపరిచింది.

అనుభవలేమితో దెబ్బతిన్న కేకేఆర్ బౌలింగ్

ముంబై బ్యాటర్లు విరుచుకుపడుతున్న సమయంలో ఒక అనుభవజ్ఞుడైన బౌలర్ అవసరం కేకేఆర్‌కు ఎంతైనా ఉంది. గ్రీన్‌కు ఐపీఎల్‌లో 16 వికెట్లు, టీ20 ఇంటర్నేషనల్స్‌లో 14 వికెట్లు తీసిన అనుభవం ఉంది. అయినప్పటికీ అతడికి బంతిని ఇవ్వకపోవడం వల్ల కేకేఆర్ బౌలింగ్ విభాగం బలహీనపడింది. దీనిపై రహానే స్పందిస్తూ.. తమ బౌలర్లకు అనుభవం తక్కువని, ఈ మ్యాచ్ నుంచి వారు చాలా విషయాలు నేర్చుకుంటారని చెప్పుకొచ్చాడు. అలాగే మ్యాచ్ మధ్యలో తనకు కండరాలు పట్టేయడం వల్ల మైదానం వీడాల్సి వచ్చిందని, అందుకే రింకూ సింగ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడని రహానే వివరించాడు.

మొత్తానికి 25 కోట్ల లెక్క తేలేదెప్పుడు?

భారీ ధర వెచ్చించి ఆల్ రౌండర్లను కొనుగోలు చేసేది క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకుంటారనే. కానీ గ్రీన్ కేవలం బ్యాటింగ్‌కే పరిమితమైతే అది కేకేఆర్ సమతూకాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. వచ్చే మ్యాచ్‌లలోనైనా గ్రీన్ బౌలింగ్ చేస్తాడా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ క్రికెట్ ఆస్ట్రేలియా ఆంక్షలు నిజమే అయితే, లీగ్ మొత్తం గ్రీన్ కేవలం బ్యాటర్ గానే కొనసాగుతాడా అన్నది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు..
టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు..
కేకేఆర్ ఓటమికి అసలు కారణం ఇదేనా? ఐపీఎల్‌లో కొత్త వివాదం
కేకేఆర్ ఓటమికి అసలు కారణం ఇదేనా? ఐపీఎల్‌లో కొత్త వివాదం
యుద్ధ సెగతో వణికిపోతున్న అగ్రరాజ్యం.. 3 వారాల్లో వేల కోట్ల నష్టం
యుద్ధ సెగతో వణికిపోతున్న అగ్రరాజ్యం.. 3 వారాల్లో వేల కోట్ల నష్టం
రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే
రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. 4గంటల్లోనే భారీగా తగ్గిన ధరలు.
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. 4గంటల్లోనే భారీగా తగ్గిన ధరలు.
తక్కువ బడ్జెట్‌లో ఇన్వర్టర్‌పై పనిచేసే టాప్ ఎయిర్ కూలర్లు ఇవే!
తక్కువ బడ్జెట్‌లో ఇన్వర్టర్‌పై పనిచేసే టాప్ ఎయిర్ కూలర్లు ఇవే!
పువ్వులు ఇలా నిల్వ చేస్తే.. ఎక్కువ రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి..
పువ్వులు ఇలా నిల్వ చేస్తే.. ఎక్కువ రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి..
రెండు చోట్ల పోటీ వెనుక రీజన్ ఇదే.. విజయ్ పెద్ద స్కెచ్చే వేశారుగా
రెండు చోట్ల పోటీ వెనుక రీజన్ ఇదే.. విజయ్ పెద్ద స్కెచ్చే వేశారుగా
మండే ఎండల్లో పైనాపిల్‌ జ్యూస్‌ తాగితే ఏమవుతుందో తెలుసా..?
మండే ఎండల్లో పైనాపిల్‌ జ్యూస్‌ తాగితే ఏమవుతుందో తెలుసా..?
హిట్‌మ్యాన్ సునామీ.. ఒకే ఇన్నింగ్స్‌తో ఐదు రికార్డులు బద్దలు
హిట్‌మ్యాన్ సునామీ.. ఒకే ఇన్నింగ్స్‌తో ఐదు రికార్డులు బద్దలు