AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology 2026 : రెండేళ్ల తర్వాత ‘మంగళాదిత్య రాజయోగం’.. ఈ 3 రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, డబుల్ జాక్‌పాట్!

ఖగోళంలో గ్రహాల కదలికలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా గ్రహాల కలయిక వల్ల ఏర్పడే యోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. 2026 ఏప్రిల్ 02వ తేదీ మధ్యాహ్నం 3:37 గంటలకు కుజుడు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ క్రమంలో సూర్యుడితో కలిపి 'మంగళాదిత్య యోగాన్ని' సృష్టించబోతున్నాడు. ఈ గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారు ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతమైన వృద్ధిని సాధించబోతున్నారు.

Astrology 2026 : రెండేళ్ల తర్వాత 'మంగళాదిత్య రాజయోగం'.. ఈ 3 రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, డబుల్ జాక్‌పాట్!
Mangal Aditya Yoga
Bhavani
|

Updated on: Mar 30, 2026 | 2:10 PM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు శక్తికి, సూర్యుడు అధికారానికి చిహ్నం. వీరిద్దరూ ఒకే రాశిలో కలిసినప్పుడు ఆ రాశుల వారికి తిరుగులేని అధికారం, సంపద లభిస్తాయి. ముఖ్యంగా మేషం, సింహం మరియు ధనుస్సు రాశుల వారికి ఈ కాలం ఒక స్వర్ణయుగంలా ఉండబోతోంది. ఉద్యోగంలో ప్రమోషన్ల నుండి వ్యాపారంలో భారీ లాభాల వరకు వీరు ఏది ముట్టుకున్నా బంగారమే కాబోతోంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మేషరాశి: మేష రాశి వారికి ఈ యోగం వల్ల ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. అదనపు బాధ్యతలతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, కొత్త ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వివాహిత జంటల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.

సింహరాశి: విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసే వారికి ఈ కాలం ఒక జాక్‌పాట్ అని చెప్పవచ్చు. మీ తెలివితేటలతో వివిధ మార్గాల్లో ఆదాయాన్ని ఆర్జిస్తారు. కార్యాలయంలో మీ పనికి పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మరియు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి వృత్తిపరంగా గతంలో కంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. నిలిచిపోయిన పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులు పెద్ద కాంట్రాక్టులు దక్కించుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా ఇది ఒక మంచి కాలం. పాత సమస్యలన్నీ పరిష్కారమై మనశ్శాంతి లభిస్తుంది.

గ్రహాల అనుకూలత వల్ల వచ్చే ఈ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. కష్టానికి తోడు గ్రహ బలం తోడైతే విజయం మీ సొంతమవుతుంది.

ఈ కాలంలో మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం లేదా సూర్య నమస్కారాలు చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగి మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేముందు పండిత నిపుణులు సంప్రదించడం ఉత్తమం.

Follow Us