Monsoon Diet: వర్షాకాలంలో పెరుగు, మజ్జిగ తినడం మంచిదేనా.. ఏ సమయంలో తినాలంటే
వాతావరణంలో మార్పులతో పాటు, ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవడం అవసరం. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. వేసవిలో మజ్జిగ, పెరుగు తినడం చాలా ప్రయోజనకరం. అయితే వర్షాకాలంలో కూడా పెరుగు, మజ్జిగను తీసుకోవచ్చా అని చాలా మంది ఆలోచిస్తున్నారా..! ఈ రోజు వర్షాకాలంలో పెరుగు, మజ్జిగ తినడం మంచిదేనా నిపుణులు చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం.

పెరుగు, మజ్జిగ అనేవి సాంప్రదాయ పాల ఉత్పత్తులు. పెరుగు లేని ఇల్లు ఉండదు అని అంటే అతిశయోక్తి కాదు. మన దేశంలో పెరుగు, మజ్జిగను తాగడానికి మాత్రమే కాదు రకరకాల వంటలలో ఉపయోగిస్తారు. ఈ రెండింటిలోనూ చాలా పోషకాలు ఉన్నాయి. అంతేకాదు ఇవి పాల కంటే జీర్ణక్రియకు మంచివి. ఎందుకంటే పాలు కిణ్వ ప్రక్రియ సమయంలో ఇది మంచి బ్యాక్టీరియాకు మూలంగా మారుతుంది. మజ్జిగలో కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వెన్న దాని నుంచి వేరు చేయబడుతుంది. కనుక వేసవిలో ప్రజలు పెరుగు, మజ్జిగను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. ఈ రెండింటి ఆమ్ల స్వభావం కారణంగా వర్షాకాలంలో పెరుగు, మజ్జిగను ఆహారంలో భాగం చేసుకోవడం సరైనదేనా అనే ప్రశ్న ప్రజల మనస్సులో తలెత్తుతుంది.
వర్షాకాలంలో వాతావరణం తేమగా, వేడిగా ఉంటుంది. ఈ వాతావరణం కళ్ళకు కనిపించని కీటకాలు, సూక్ష్మ బాక్టీరియా పెరుగుదలకు ఉత్తమమైనది. కనుక ఈ సమయంలో ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం ఎక్కువగా ఉన్నందున చాలా ఆహారాలు తినవద్దని నిపుణులు చెబుతున్నారు. కనుక ఈ రోజు వర్షాకాలంలో పెరుగు, మజ్జిగ తినాలా వద్దా అని వైద్యుడి చెప్పిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం..
పోషకాలు సమృద్ధి ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ గీతికా చోప్రా పెరుగు, మజ్జిగ రెండూ చల్లదనాన్నిచ్చే స్వభావాన్ని కలిగి ఉన్నాయి. రెండింటిలోనూ ప్రోబయోటిక్స్, కాల్షియం, విటమిన్ బి12, ప్రోటీన్ ఉన్నాయి. ఇవి నీటికి మంచి మూలం కనుక ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడతాయి.
వర్షంలో పెరుగు, మజ్జిగ తినవచ్చా? పేగు ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, జీర్ణక్రియకు ఇవి ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. కనుక వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు అని.. అయితే సరైన సమయంలో వీటిని తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. అయితే ప్రస్తుతం ఎక్కువ మంది పెరుగు, మజ్జిగ ఎక్కువగా ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేస్తున్నారు. ఇలా చేయడం వలన అవి మరింత చల్లగా మారుతాయి. రాత్రి సమయంలో ఫ్రిజ్ నుంచి తీసిన చల్లని ఆహారాన్ని తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. పగటి సమయంలో వీటిని గది ఉష్ణోగ్రత వద్ద పెట్టి.. తీసుకోవచ్చు ఎందుకంటే ఇది సురక్షితం.
ఎవరు పెరుగు, మజ్జిగ తినవద్దంటే ఆర్థరైటిస్ లేదా ఏదైనా రకమైన కీళ్ల నొప్పులు ఉన్నవారు వర్షాకాలంలో రాత్రి సమయంలో పెరుగు, మజ్జిగ తినకూడదు. అంతేకాదు ఎవరైనా జలుబు, దగ్గు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. పెరుగు, మజ్జిగను తీసుకోవద్దు. అయితే వర్షాకాలంలో పెరుగుని లేదా మజ్జిగను మధ్యాహ్నం తినడం మంచిదని గుర్తుంచుకోండి.
పెరుగు, మజ్జిగ ఎలా తినాలంటే డాక్టర్ గీతిక మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో పెరుగు , మజ్జిగ తీసుకోవడం ఉత్తమం. గది ఉష్ణోగ్రత వద్ద తీసుకోండి. దీనికి కొద్దిగా ఇంగువ, జీలకర్ర, నల్ల ఉప్పు కలపండి. ఇలా చేయడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








