AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile: ఏంటీ రెండు గంటలకు మించి ఫోన్‌ వాడితే.. ఇన్ని అనర్థాల?

ఈ మధ్య కాలంలో మొబైల్‌ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. సోషల్‌ మీడియా వచ్చాక మొబైల్‌ వాడకం మరింత పెరిగిపోయింది. కొందరైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌ను స్క్రోల్‌ చేస్తూనే ఉంటారు. ఇలా ఫోన్‌ను ఎక్కువగా వాడడం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి మాత్రం ఎవరూ అలోచించరు. అయితే ఫోన్‌ ఎక్కువగా వాడడం వల్ల ఏం జరుగుతుంది. అసలు ఫోన్‌ను ఎంత సేపు వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

Mobile: ఏంటీ రెండు గంటలకు మించి ఫోన్‌ వాడితే.. ఇన్ని అనర్థాల?
మీరు కూడా మీ మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకుని నిద్రపోతే వెంటనే ఈ అలవాటును మానుకోండి. ఖచ్చితంగా మీ ఆరోగ్యానికి చాలా హానికరం మరియు ప్రమాదకరం. దీని వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Anand T
|

Updated on: Aug 14, 2025 | 12:23 AM

Share

ఈ మధ్య కాలంలో మొబైల్‌ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. సోషల్‌ మీడియా వచ్చాక మొబైల్‌ వాడకం మరింత పెరిగిపోయింది. కొందరైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌ను స్క్రోల్‌ చేస్తూనే ఉంటారు.  ఇలా ఫోన్‌ను ఎక్కువగా వాడడం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి మాత్రం ఎవరూ అలోచించరు. రాత్రి పడుకునే ముందు ఫోన్‌ వాడడం చాలా మందికి అలావాటు ఇలా మొబైల్ ఫోన్‌ ఎక్కువ వాడటం మానసిక ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. కొందరు అదేపనిగా ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతూ ఫోన్‌కు బానిసలు అయిపోతారు. ఇది వాళ్లను మానసికంగానే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు.. పెద్దలు రోజుకు రెండు గంటలకు మించి తమ ఫోన్‌లను ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  అయితే ఈ ఫోన్‌ ఎక్కవుగా వాడితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, వాటిని ఎలా నివారించాలి ఇక్కడ తెలుసుకుందాం.

అతిగా ఫోన్ వాడటం వల్ల కలిగే నష్టాలు

  • ఎక్కువ సమయం ఫోన్‌ స్క్రీన్ చూడటం వల్ల కళ్ళు ఒత్తిడి పడి..కళ్ళు పొడిబారడం, దృష్టి మసకబారడం వంటి సమస్యలకు దారితీస్తుంది.
  • ఫోన్‌ను అతిగా వాడటం వల్ల ఆందోళన, నిరాశ, సామాజిక సంబంధాల నుండి వైదొలగడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
  • ఫోన్ల నుండి వచ్చే బ్లూలైట్‌ మన నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది, ఇది నిద్రలేమికి దారితీస్తుంది.
  • ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల మెడ, వీపు, భుజం నొప్పులు వస్తాయి. ఎక్కువ సేపు ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

అతిగా ఫోన్ వాడటం వల్ల కలిగే నష్టాలు

  • మనం ఒక టైమ్‌ ఫిక్స్‌ చేసుకొని రోజూ టైమ్‌ తర్వాత ఫోన్ వాడకాన్ని పూర్తిగా మానుకోండి.
  • ప్రతి 20 నిమిషాలకు మీ కళ్ళకు 20 సెకన్ల విశ్రాంతి ఇవ్వండి
  • వారానికి కనీసం ఒక రోజు మీ ఫోన్‌కు పూర్తిగా దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.
  • పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, స్నేహితులతో నేరుగా మాట్లాడటం వంటి వాటిపై దృష్టి పెట్టండి.
  • ఈ కొన్ని అలవాట్లు మీ మొబైల్ ఫోన్ వాడకాన్ని నియంత్రించడంలో మీకు సహాయపడతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.