Lemon Water: ఉదయం పరగడుపున నిమ్మరసం తాగే అలవాటు ఉందా.. ఈ సమస్యలుంటే జాగ్రత్త సుమీ..
బరువు తగ్గడం నుండి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం వరకూ నిమ్మరసం మేలు చేస్తుంది. అయితే నిమ్మరసాన్ని ఖాళీ కడుపుతో తాగుతున్నవారి సంఖ్య రోజు రోజుకీ అధికమవుతుంది. అయితే ఇలా పరగడుపున నిమ్మరసం తాగుతుంటే తప్పని సరిగా కొని విషయాలను తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే ఇలా తాగడం కొంతమంది ఆరోగ్యానికి హానికరం. జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ఈ రోజున ఎవరు పరగడుపున నిమ్మరసం తాగకూడదో తెలుసుకుందాం..
శరీర పనితీరులో విటమిన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. విటమిన్లు అనేక రకాలున్నాయి. వాటిల్లో ఒకటి విటమిన్ సీ.. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. నిమ్మకాయ, ఉసిరి, నారింజ వంటి వాటిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అయితే ఇప్పుడు వేసవికాలంతో మాత్రమే కాదు రోజువారీ జీవితంలో నిమ్మరసం తాగడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బరువు తగ్గడం నుండి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం వరకూ నిమ్మరసం మేలు చేస్తుంది. అయితే నిమ్మరసాన్ని ఖాళీ కడుపుతో తాగుతున్నవారి సంఖ్య రోజు రోజుకీ అధికమవుతుంది. అయితే ఇలా పరగడుపున నిమ్మరసం తాగుతుంటే తప్పని సరిగా కొని విషయాలను తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే ఇలా తాగడం కొంతమంది ఆరోగ్యానికి హానికరం. జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ఈ రోజున ఎవరు పరగడుపున నిమ్మరసం తాగకూడదో తెలుసుకుందాం..
ఈ సమస్యలున్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండండి..
- నిమ్మకాయలో ఉన్న యాసిడ్ కారణంగా ఎముకలకు హాని జరుగుతుంది. కనుక ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వద్దు.
- నిమ్మకాయలో అధిక మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కనుక ఎసిడిటీ సమస్యతో ఇబ్బంది పడేవారు నిమ్మరసం తాగకూడదు.
- నిమ్మకాయలో ఉండే యాసిడ్ దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. కనుక దంతాల సున్నితత్వం ఉన్నవారు నిమ్మకాయను అధికంగా ఉపయోగించవద్దు. దంతాలను రక్షించే ఎనామిల్ బలహీన పడుతుంది.
- మూత్రపిండాల సమస్య ఉన్నవారు నిమ్మరసం తాగావద్దు. ఇలా తాగడం కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..