మల్లెపూలతో ఆరోగ్యానికి ఎంత మంచి ప్రయోజనాలున్నాయో తెలుసా? ఇంతకు మించిన దివ్యౌషధం లేదు..

మల్లె శరీంరలోని సూక్ష్మక్రిమి సంహారిగా అద్భుతంగా పనిచేస్తుందట. సుఖ రోగాలకి, పచ్చ కామెర్లకి, దివ్యౌషధంగా పనిచేస్తుందట. మల్లె ఆకులతో తయారైన ఆయుర్వేద మందులు మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకి బాగా ఉపయోగిస్తారు. మన శరీరంలో హార్మోర్ల సమతుల్యతను సరిచేస్తుంది. చలికాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి జాస్మిన్

మల్లెపూలతో ఆరోగ్యానికి ఎంత మంచి ప్రయోజనాలున్నాయో తెలుసా? ఇంతకు మించిన దివ్యౌషధం లేదు..
Jasmine Flowers
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 11, 2025 | 12:36 PM

మంచి సువాసనలు వెదజల్లే మల్లెపువ్వు.. అందరికీ ప్రియమైనదే. కొందరు ఈ మల్లెపూలను పూజకు వాడితే, మరికొందరు అలంకరణ కోసం వాడుతుంటారు. ఇంకొందరు అందంగా కనిపించేందుకు తలలో పెట్టుకుంటారు. అయితే, మల్లెపువ్వు కేవలం ఆధ్యాత్మికం, అందానికి మాత్రమే కాదు.. మల్లెలో ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మల్లెలో ఉండే అనేకమైన ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎన్నో శారీరక, మానసిక సమస్యలను దూరం చేస్తుంది. మల్లెపూలు చాలా రోగాలకు నివారణగా కూడా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి మల్లెపువ్వు చాలా బాగా పనిచేస్తుంది.

మ్లలెపువ్వు మన మానసిక శారీరక అనారోగ్యాలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తలలో పెట్టుకోవటం వల్ల జుట్టు రాలకుండా, తలలో పుండ్లు ఏర్పడకుండా, సూక్ష్మక్రిములు చేరకుండా కాపాడుతుందంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాకుండా జుట్టుకి కావాల్సిన పోఫషక విలువలు అందిస్తుంది. జుట్టు పొడవుగా పెరగడానికి దోహడపడుతుంది. శరీర బడలికని తీర్చి, ప్రశాంతమైన నిద్రనిస్తుందట. అంతేకాదు, మల్లెపూలతో చేసిన మల్లె టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదట.

మల్లె శరీంరలోని సూక్ష్మక్రిమి సంహారిగా అద్భుతంగా పనిచేస్తుందట. సుఖ రోగాలకి, పచ్చ కామెర్లకి, దివ్యౌషధంగా పనిచేస్తుందట. మల్లె ఆకులతో తయారైన ఆయుర్వేద మందులు మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకి బాగా ఉపయోగిస్తారు. మన శరీరంలో హార్మోర్ల సమతుల్యతను సరిచేస్తుంది. చలికాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి జాస్మిన్ ఆయిల్ తో మసాజ్ చేయటం వల్ల కీళ్ల నొప్పుల నుంచి చాలావరకు ఉపశమనాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..