ఎర్ర‌తోట‌కూర తింటే ఎన్ని అదిరిపోయే బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?

తోటకూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణాశయం సంబంధ సమస్యలు అన్ని పరిష్కరించబడతాయి. పేగుల ఆరోగ్యాన్ని దృఢపరుస్తుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉండటం వల్ల మలబద్ధకమనే సమస్య దరిచేరదు.

ఎర్ర‌తోట‌కూర తింటే ఎన్ని అదిరిపోయే బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
Red Amaranth Leaves
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 16, 2023 | 6:12 PM

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాల్లో ఆకుకూర‌లు ముందు వ‌రుస లో ఉంటాయి. అటువంటి ఆకుకూర‌ల్లో ఎన్నో ర‌కాలు ఉన్నాయి. అందులో తోట కూర, ఎర్ర తోట కూరలో దాగివున్న ఆరోగ్య రహాస్యాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. ఎర్ర తోట‌కూర‌లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, ఐర‌న్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబ‌ర్‌, ప్రోటీన్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి. అందుకే ఆరోగ్యానికి ఎర్ర తోట‌కూర ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వారానికి ఒక‌టి, రెండు సార్లు ఎర్ర తోట‌కూర‌ను తీసుకుంటే అందులో ఉండే కాల్షియం ఎముక‌లు, దంతాలు దృఢంగా మారేందుకు స‌హాయ‌ప‌డుతుంది. అలాగే అధిక ర‌క్త పోటుతో బాధ ప‌డే వారు ఎర్ర తోట కూర‌ను డైట్‌లో చేర్చుకోవాల్సిందే.ఎందుకంటే, ర‌క్త పోటు స్థాయిల‌ను అదుపు చేయ‌డంలో ఎర్ర తోట‌కూర ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఎర్ర తోట‌కూర తీసుకోవ‌డం వ‌ల్ల‌ గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గు ముఖం ప‌డుతుంది. అంతేకాదు, ఎర్ర తోట‌కూరను తీసుకోవడం వ‌ల్ల ర‌క్త హీన‌త తగ్గిపోతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది. క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గుతుంది. ఇక గ‌ర్భిణీల‌కు కూడా ఎర్ర తోట‌కూర ఎంతో మంచిది. ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఎర్ర తోట‌కూర‌ను తీసుకుంటే. అందులో ఉండే పోష‌కాలు త‌ల్లి, పుట్ట‌బోయే బిడ్డ ఆరోగ్యానికి తోడ్ప‌డ‌తాయి.

తోటకూర రక్తహీనతను తగ్గిస్తుంది, శరీరంలో అవసరమైన ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది కాబట్టి అనిమియా ఉన్న వాళ్ళు తోటకూరను ఎంత సమృద్ధిగా తీసుకుంటే అంత మంచిది.  తోటకూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణాశయం సంబంధ సమస్యలు అన్ని పరిష్కరించబడతాయి. పేగుల ఆరోగ్యాన్ని దృఢపరుస్తుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉండటం వల్ల మలబద్ధకమనే సమస్య దరిచేరదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..