AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్ర సంకేతం అనుకున్నారా? ఆవలింతల అసలు కథ ఇదే!

Reason Behind Yawning: ఆవలింత ఎందుకు వస్తుంది? కేవలం నిద్ర వస్తుందనో, బోరు కొడుతుందనో మాత్రమే కాదు.. ఆవలింత వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ ప్రక్రియ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెదడును శుభ్రం చేయడంలో ఆవలింతలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది.

నిద్ర సంకేతం అనుకున్నారా? ఆవలింతల అసలు కథ ఇదే!
Real Secret Behind Yawning
Rajashekher G
|

Updated on: May 06, 2026 | 12:33 PM

Share

మనకు బోర్‌గా ఉన్నప్పుడు, అలసటగా అనిపించినప్పుడు లేదా నిద్ర ముంచుకొస్తున్నప్పుడు సహజంగానే ఆవలింతలు వస్తుంటాయి. చాలా మంది దీన్ని కేవలం నిద్ర సంకేతంగా మాత్రమే భావిస్తారు. కానీ శాస్త్రవేత్తల ప్రకారం ఆవలింత అంత సాదాసీదా విషయం కాదు.. అది మన మెదడును రక్షించే ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇటీవల చేసిన పరిశోధనలు చెబుతున్నదేమిటంటే.. మన మెదడు, వెన్నెముక చుట్టూ ఉండే “సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (CSF)” అనే ద్రవం ఆవలింత సమయంలో ప్రత్యేకంగా ప్రవర్తిస్తుంది. సాధారణంగా గట్టిగా ఊపిరి పీల్చినప్పుడు ఈ ద్రవం మెదడు వైపు కదులుతుంది. కానీ ఆవలింత తీసినప్పుడు మాత్రం ఇది మెదడు నుంచి బయటికి కదులుతున్నట్టు గుర్తించారు. ఈ విషయం పరిశోధకులకు ఆశ్చర్యం కలిగించింది.

మెదడు శుభ్రపరిచే ప్రక్రియ

ఈ ప్రక్రియ వల్ల మెదడులో రక్తప్రసరణ తాత్కాలికంగా మారుతుంది. పాత రక్తం బయటికి వెళ్లి, కొత్త రక్తం లోపలికి రావడానికి ఇది సహాయపడుతుంది. దీంతో మెదడులో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలు తొలగిపోవచ్చు. ఈ కారణంగా ఆవలింతను ఒక రకంగా “మెదడు శుభ్రపరిచే ప్రక్రియ”గా భావిస్తున్నారు. భవిష్యత్తులో అల్జీమర్స్ వంటి వ్యాధుల నివారణలో కూడా ఇది పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే…

ప్రతి వ్యక్తి ఆవలించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. నోరు తెరవడం, నాలుక కదలిక వంటి అంశాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. ఇది అంత ప్రత్యేకమైందిగా ఉండటంతో, ఒక వ్యక్తిని అతని ఆవలింత తీరుతో కూడా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే, పెద్ద మెదడు కలిగిన జీవుల్లో ఆవలింత వ్యవధి ఎక్కువగా ఉంటుందని కూడా గుర్తించారు. మరో సిద్ధాంతం ప్రకారం, ఆవలింతలు మెదడును చల్లబరచడంలో కూడా సహాయపడతాయి.

మొత్తానికి, ఆవలింత అనేది కేవలం అలసట సంకేతం కాదు.. అది మన మెదడును శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచే సహజమైన వ్యవస్థ. ఇకపై ఎవరైనా ఆవలిస్తే, వారు నిద్రపోతున్నారు అని కాకుండా, వారి మెదడు పనిచేస్తోంది అని అనుకోవచ్చు!

(Disclaimer: ఇక్కడ అందించిన సమా..చారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us