AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most IPL Finals List : ఐదోసారి ఫైనల్స్ టికెట్ బుక్ చేసుకుని చరిత్ర తిరగరాసిన బెంగుళూరు.. చెన్నై రికార్డ్ పై కన్ను

Most IPL Finals List : గుజరాత్ టైటాన్స్ జట్టును ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, ఈ సీజన్‌లో దటీజ్ ఆర్‌సీబీ అంటూ గర్వంగా ఫైనల్ టికెట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ అద్భుత విజయంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరిన జట్ల జాబితాలో బెంగళూరు జట్టు మూడో స్థానానికి దూసుకెళ్లి సంచలనం సృష్టించింది.

Most IPL Finals List : ఐదోసారి ఫైనల్స్ టికెట్ బుక్ చేసుకుని చరిత్ర తిరగరాసిన బెంగుళూరు.. చెన్నై రికార్డ్ పై కన్ను
Rcb
Rakesh
|

Updated on: May 27, 2026 | 8:50 AM

Share

Most IPL Finals List : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ కు చేరుకుంది. మంగళవారం రాత్రి ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) దుమ్మురేపింది. గుజరాత్ టైటాన్స్ జట్టును ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, ఈ సీజన్‌లో దటీజ్ ఆర్‌సీబీ అంటూ గర్వంగా ఫైనల్ టికెట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ అద్భుత విజయంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరిన జట్ల జాబితాలో బెంగళూరు జట్టు మూడో స్థానానికి దూసుకెళ్లి సంచలనం సృష్టించింది. 19 ఏళ్ల ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఫైనల్స్ రేసులో ఏ జట్లు టాప్‌లో ఉన్నాయో చూద్దాం.

ఫైనల్స్ చేరడంలో ఆర్‌సీబీ సరికొత్త రికార్డు

ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 గెలవడం ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐదోసారి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన బలమైన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రికార్డును ఆర్‌సీబీ బ్రేక్ చేసింది. కేకేఆర్ ఇప్పటివరకు 4 సార్లు ఫైనల్ చేరగా.. ఆర్‌సీబీ ఇప్పుడు 5వ సారి ఫైనల్స్‎కు చేరి మూడో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఆర్‌సీబీ తన ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సీజన్లలో (2025, 2026) ఫైనల్స్ చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

లిస్ట్‌లో నంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ఫైనల్స్ ఆడిన జట్ల లిస్ట్‌లో ధోనీకి చెందిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఎవరికీ అందనంత ఎత్తులో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. సీఎస్‌కే ఇప్పటివరకు రికార్డు స్థాయిలో ఏకంగా 10 సార్లు ఐపీఎల్ ఫైనల్స్ కు చేరింది. ఇందులో 5 సార్లు ట్రోఫీని ముద్దాడగా.. మరో 5 సార్లు రన్నరప్‌గా నిలిచింది. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఫైనల్స్ గెలిచిన రికార్డుతో పాటు, అత్యధిక సార్లు ఫైనల్స్ ఓడిపోయిన విచిత్రమైన రికార్డు కూడా చెన్నై పేరిటే ఉంది.

రెండో స్థానంలో ముంబై ఇండియన్స్

ఈ జాబితాలో రెండో స్థానంలో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ (MI) నిలిచింది. ముంబై జట్టు ఇప్పటివరకు మొత్తం 6 సార్లు ఐపీఎల్ ఫైనల్స్ బరిలోకి దిగింది. ముంబై ఫైనల్స్ రికార్డు ఎంత అద్భుతంగా ఉంటుందంటే.. ఆడిన ఆరు ఫైనల్స్‌లో 5 సార్లు టైటిల్ కొట్టేసింది. కేవలం ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే ఫైనల్లో ఓటమి చవిచూసింది. లీగ్ దశలో ఎలా ఆడినా ఫైనల్స్ కు వస్తే మాత్రం ముంబైని కొట్టడం ఎవరికైనా అసాధ్యమనేలా వారి ట్రాక్ రికార్డు ఉంటుంది.

నాలుగు, ఐదు స్థానాల్లో కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 4 సార్లు ఫైనల్స్ ఆడి 3 సార్లు విజేతగా నిలిచి నాలుగో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నిలిచింది. ఆరెంజ్ ఆర్మీ ఇప్పటివరకు మొత్తం 3 సార్లు ఐపీఎల్ ఫైనల్స్ ఆడి, ఒకసారి (2016లో) ట్రోఫీని గెలుచుకుంది. ఈ ఏడాది కూడా ఎస్‌ఆర్‌హెచ్ ఎలిమినేటర్ ద్వారా ఫైనల్స్ కు రావాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఆర్‌సీబీ ఫైనల్స్ ప్రయాణం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటిసారి 2009లో అనిల్ కుంబ్లే కెప్టెన్సీలో ఫైనల్స్ చేరి డెక్కన్ చార్జర్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత 2011, 2016 లలో కూడా ఫైనల్స్ ఆడినప్పటికీ దురదృష్టవశాత్తూ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఇక ఈ సాలా కప్ నమ్దే అనే నినాదాన్ని నిజం చేస్తూ గత ఐపీఎల్ 2025 సీజన్లో మొదటిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో 2026లో వరుసగా రెండో టైటిల్ కొట్టేందుకు ఆర్‌సీబీ ఆర్మీ రెడీ అయిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us