Lifestyle: బంగారం, వెండి కంటే కాస్ట్లీ.! ఈ రెండు ఫుడ్స్ ఏంటో తెలిస్తే
ఇటీవల కాలంలో బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్న సంగతి తెలిసిందే. అయితే బంగారం కంటే ఈ రెండు భారీ ధరలు పలుకుతున్నాయి. అవే కుంకుమ పువ్వు, గుచ్చి పుట్టగొడుగులు. వాటి అరుదైన లభ్యత, సేకరించే విధానంలోని కష్టాలు, అద్భుతమైన పోషక, ఔషధ గుణాల వల్ల ఇవి సామాన్యులకు అందని ద్రాక్షలా మారాయి.

బంగారం ధర ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత రోజుల్లో, మనం రోజువారీగా వాడే ఈ పదార్ధాలు కూడా ఏమాత్రం తీసిపోని రీతిలో ఖరీదైనవిగా మారాయి. కేవలం వాటి రుచి కోసం మాత్రమే కాకుండా, వాటి అరుదైన ఔషధ గుణాలు, వాటిని సేకరించే లేదా ఉత్పత్తి చేసే విధానంలో ఎదురై సవాళ్లు ఈ పదార్థాలు సామాన్యులకు అందని ద్రాక్షలా మారాయి. మరి అవేంటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. మొదటిది.. కాశ్మీర్‌లో పండే కుంకుమ పువ్వు. దీనిని ‘రెడ్ గోల్డ్’ అని అంటారు. దీని ధర, విలువ బంగారంతో పోల్చుతుంటారు. ఒక కిలో కుంకుమ పువ్వును సేకరించడానికి దాదాపు 1,50,000 క్రోకస్ పువ్వులు అవసరమవుతాయి. ఈ పువ్వుల నుంచి కుంకుమ పువ్వు రేకులను సేకరించే ప్రక్రియ అత్యంత శ్రమతో కూడుకున్నది. ప్రతి పువ్వు నుంచి కేవలం మూడు సన్నని, సున్నితమైన రేకులను మాత్రమే చేత్తో చాలా జాగ్రత్తగా, నైపుణ్యంగా తీయాలి. ఈ కష్టమైన ప్రక్రియ, అధిక శ్రమ కారణంగానే మార్కెట్లో ఒక కిలో స్వచ్ఛమైన కుంకుమ పువ్వు ధర సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. దీని అద్భుతమైన సువాసన, అటుపై భారతీయ వంటకాలలో, సంప్రదాయ వైద్యంలో దీనికి ఉన్న ఎన్నో ఔషధ గుణాలు దీనికి అంతటి విలువను, డిమాండ్‌ను తెచ్చిపెట్టాయి. చర్మ సౌందర్యం నుంచి ఆరోగ్యం వరకు అనేక ప్రయోజనాలను అందించే ఈ కుంకుమ పువ్వు, అత్యంత ఖరీదైన వాటిల్లో ఒకటిగా నిలిచింది.
ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’
ఇక రెండోది.. హిమాలయ పర్వతాల్లో దొరికే గుచ్చి పుట్టగొడుగులు. ఇవి తోటల్లో లేదా వ్యవసాయ క్షేత్రాలలో పండించేవి కావు. కేవలం హిమాలయాలలోని మంచు కరిగినప్పుడు సహజంగా మొలుస్తాయి. వీటిని సేకరించడం కూడా ఒక సాహసంతో కూడిన పని, అడవిలో ప్రత్యేకంగా వీటిని వెతికి పట్టుకోవడం ఎంతో కష్టమైన ప్రక్రియ. అందుకే ఇవి అత్యంత అరుదైనవిగా, విలువైనవిగా చూస్తారు. వీటిలో ఉండే అపారమైన పోషక విలువలు, రుచి వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. కిలో గుచ్చి పుట్టగొడుగుల ధర సుమారు 30,000 నుంచి 40,000 వరకు పలుకుతుంది. వీటిని పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్లలో వంటకాల్లో వాడతారు. వాటి ప్రత్యేకమైన రుచి, ఆరోగ్యం పట్ల అవి అందించే ప్రయోజనాలు, వాటి అరుదైన లభ్యత కారణంగా ఇవి అత్యంత ఖరీదైన ఆహారాలలో ఒకటిగా నిలిచాయి.
ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




