విటమిన్-డి తగినంత అందాలంటే ఎప్పుడు, ఎంతసేపు ఎండలో ఉండాలో తెలుసా..? తప్పక తెలుసుకోండి..
విటమిన్ డి తీసుకోవడం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అనేక వ్యాధులను నివారిస్తుంది. విటమిన్ డి తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఇది మనలో మానసిక స్థితిని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండి కండరాలు దృఢంగా ఉంటాయి.
విటమిన్ డి శరీరానికి అవసరమైన విటమిన్లలో అతి ముఖ్యమైనది. ఇది శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఈ విటమిన్ కాల్షియం, ఫాస్పరస్ శోషణలో సహాయపడుతుంది. విటమిన్ డి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో ఈ విటమిన్ లోపం వల్ల బోలు ఎముకల వ్యాధి, రికెట్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ డి కీలకమైనది. విటమిన్ డి తీసుకోవడం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అనేక వ్యాధులను నివారిస్తుంది. విటమిన్ డి తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఇది మనలో మానసిక స్థితిని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండి కండరాలు దృఢంగా ఉంటాయి.
విటమిన్ డి కూడా బరువు తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కానీ, ఇది మనం తీసుకునే ఆహారం ద్వారా అతితక్కువ మోతాదులో అందుతుంది. సూర్యకాంతి ద్వారా మాత్రమే తగినంత విటమిన్ డి మన శరీరానికి అందుతుంది. అయితే రోజులో సూర్యకాంతి ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది..? ఏ సమయంలో మనం ఎండలో నిలబడితే మన శరీరం ఎక్కువ విటమిన్ డిని తయారు చేసుకుంటుందో మీకు తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
సూర్యుని నుంచి వచ్చే UVB కిరణాలను మన చర్మం గ్రహిస్తుంది. రోజులో ఉదయం లేదా సాయంత్రం సమయంలో అతినీలలోహిత కిరణాల ప్రభావం తక్కువగా ఉంటుంది. కనుక ఉదయం 8 గంటల లోపు లేదా సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య సూర్య కాంతి తగిలేలా ఎండలో ఉండటం మంచిది. దీంతో మన శరీరం సూర్యకాంతిని గ్రహించుకుని విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. విటమిన్ డిని శరీరం అలా తయారు చేసుకుని పలు అవసరాలకు ఉపయోగించుకుంటుంది.
అయితే, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల ప్రాంతంలో సూర్యకాంతి ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరానికి హాని కలిగిస్తుంది. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వారంలో మూడు నుంచి నాలుగు రోజులు సూర్యరశ్మిలో ఉండటం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డీ అందుతుంది.
కోడిగుడ్లు, చీజ్, నారింజ పండ్లు, పుట్టగొడుగులు, మటన్ లివర్, చేపలు, రొయ్యలు, జున్ను, నెయ్యి, మొక్కజొన్న, పాలు, పచ్చి బఠానీలు వంటి ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కూడా మనం విటమిన్ డిని పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.