- Telugu News Latest Telugu News Can people with sugar eat jaggery? What do experts say? Check Here is Details
Diabetes: షుగర్ ఉన్నవాళ్లు బెల్లం తినొచ్చా.. నిపుణులు ఏం అంటున్నారంటే!
సాధారణంగా షుగర్ వ్యాధితో బాధ పడేవారు పంచదారకు బదులుగా బెల్లాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. బెల్లం తిన్నా కూడా షుగర్ లెవల్స్ పెరగడంలో ఎలాంటి మార్పులు ఉండవు..
Updated on: Nov 25, 2024 | 9:29 PM

ఈ మధ్య కాలంలో షుగర్‌తో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. యంగ్ ఏజ్‌లో ఉన్నవారు కూడా డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తీపి తినాలంటే చాలా కష్టం. అయితే పంచదారకు బదులుగా బెల్లాన్ని ఉపయోగిస్తున్నారు.

బెల్లం తింటే మంచిదే. కానీ ఇందులో కూడా తీపి లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. బెల్లం తింటే మంచిదే.. షుగర్ లెవల్స్ పెరగవు అనుకుంటే మాత్రం పప్పులో కాలు వేసినట్టే. బెల్లం తిన్నా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి పెరుగుతాయి.

బెల్లంలో కూడా సుక్రోజ్ ఉంటుంది. కాబట్టి బెల్లం తిన్నా కూడా రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. బెల్లం తిన్నంత మాత్రాన షుగర్ కంట్రోల్ అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటే.

పంచదార నేరుగా ఎక్కువ తినడం మంచిది కాదు కాబట్టి.. అందుకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని వాడమంటారు. ఎలాంటి జబ్బులు లేవి వాళ్లు తింటే మంచిదే. కానీ షుగర్ ఉన్నవాళ్లు తింటే మాత్రం షుగర్ లెవల్స్ అనేవి పెరగడం ఖాయం.

బెల్లంలో కూడా ఎక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. వీటిని తరచుగా తీసుకుంటే బరువు పెరిగేందుకు హెల్ప్ చేస్తాయి. ఊబకాయం అనేది డయాబెటీస్‌ని మరింత తీవ్రతరం చేస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




