Health News: చలికాలంలో ఆకు కూరలు తినకూడదా.. దీనిలో నిజమెంత..? నిపుణుల సూచన..
అయితే ఆకు కూరలు అధికంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని అంతా అనుకుంటారు. కానీ కొన్ని దుష్ర్పభావాలు కూడా ఉన్నాయంటే నమ్ముతారా..? అవును మీరు విన్నది నిజమే.. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు ఆకు కూరలు తినడం హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి… నిత్యం ఏదో ఒక ఆకుకూరను మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చునని పోషకాహర నిపుణులు చెబుతుంటారు. ఆకు కూరలతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని, అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. ఆకుకూరల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటం, ప్రొటీన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండటం వల్ల మన జీవనశైలిని మార్చే సత్తా వాటికి ఉందని వైద్యులు చెబుతుంటారు.
ప్రస్తుతం శీతాకాలం కావడంతో మార్కెట్లో రకరకాల ఆకుకూరలు అందుబాటులో ఉంటాయి. ప్రజలు తమ అభీష్టాన్ని బట్టి ఆకు కూరలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అయితే ఆకు కూరలు అధికంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని అంతా అనుకుంటారు. కానీ కొన్ని దుష్ర్పభావాలు కూడా ఉన్నాయంటే నమ్ముతారా..? అవును మీరు విన్నది నిజమే.. అయితే కొన్ని ఆకు కూరలను చలికాలంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు ఆకు కూరలు తినడం హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బచ్చలి కూర బచ్చలికూరను ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు వస్తాయని చెబుతుంటారు.. ఈ కూరగాయలలోని ఫైబర్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీంతో గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎవరికైనా గ్యాస్ సంబంధిత సమస్యలు ఉంటే ఆకుకూరలు ఎక్కువగా తినకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఆకుకూరల్లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది సమస్యను తీవ్రతరం చేస్తుంది. అలాగే అలెర్జీ సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు కూడా ఆకు కూరలు శీతాకాలంలో తినకూడదు. ఇంకా కీళ్ల నొప్పులు ఉన్నవారు ఆకుకూరలు ఎక్కువగా తినకూడదు ఎందుకంటే ఆకుకూరల్లో ఆక్సలేట్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సమస్యను మరింత పెంచే అవకాశం ఉందంటున్నారు.
అలాగే, పాలకూరను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రంలో కాల్షియం విసర్జనను పెంచడం వల్ల కిడ్నీలో రాళ్లు వంటి ఆరోగ్య సమస్య దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, కాలే వంటి కూరల్లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇలాంటి ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. ఈ ఆకుకూరను మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అధిక రక్తపోటుతో బాధపడేవారు వారు కూడా ఆకు కూరలు ఎక్కువగా తినకూడదు. ఇవి ప్రయోజనానికి బదులుగా మరింత హాని చేస్తాయని చెబుతున్నారు. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలుంటే వైద్యుల సలహా మేరకు ఆకు కూరలను తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి