AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala: పాములు బాబోయ్‌ పాములు.. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో కుప్పలుతెప్పలుగా దర్శనం.. అధికారుల అలర్ట్‌..!

గ‌తంతో పోలిస్తే ఇప్పుడు చాలా త‌క్కువ సంఖ్య‌లో శ‌బ‌రిమ‌ల క్షేత్రంలో పాములు సంచ‌రిస్తున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. గ‌తంలో కింగ్ కోబ్రాలు ఆ ప్రాంతంలో ఉండేవ‌ని, కానీ ఇప్పుడు చాలా వ‌ర‌కు విషం లేని స‌ర్పాలు క‌నిపిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. పాము కాటుకు సంబంధించిన వైద్య చికిత్స

Sabarimala: పాములు బాబోయ్‌ పాములు.. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో కుప్పలుతెప్పలుగా దర్శనం.. అధికారుల అలర్ట్‌..!
Snakes Rescued From Sabarimala
Jyothi Gadda
|

Updated on: Nov 24, 2024 | 11:52 AM

Share

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప మండ‌ల దీక్ష సీజ‌న్ మొద‌లై కొన్ని రోజులే అవుతోంది. అయితే, ఇప్పటికే శ‌బ‌రిమ‌ల అయ్యప్ప ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు బారులు తీరారు. ఈ క్రమంలోనే ఆలయ పరిసరాల్లో భారీ విషసర్పాలు కలకలం రేపుతున్నాయి. శబరిమల ఆలయ పరిసరాల్లో ఈ సీజన్‌ మొదలైనప్పటికీ నుంచి ఇప్పటి వరకు 33 పాములను పట్టుకున్నారు. వీటిలో కామ‌న్ క్రెయిట్‌(అనాలీ), 14 వైల్డ్ స్నేక్స్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

సన్నిధానంలో పాములను రక్షించిన వీడియోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేయడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు భక్తులు, ప్రజలకు పలు సూచనలు చేశారు. పెరియార్ వన్య‌ప్రాణి సంర‌క్ష‌ణ అట‌వీ ప్రాంతంలో న‌డుస్తున్న స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులు సూచించారు. స‌ర్పాల గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాము కాటు సంఘ‌ట‌న‌లు చాలా త‌క్కువే న‌మోదు అవుతున్న‌ట్లు తెలిపారు.

గ‌తంతో పోలిస్తే ఇప్పుడు చాలా త‌క్కువ సంఖ్య‌లో శ‌బ‌రిమ‌ల క్షేత్రంలో పాములు సంచ‌రిస్తున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. గ‌తంలో కింగ్ కోబ్రాలు ఆ ప్రాంతంలో ఉండేవ‌ని, కానీ ఇప్పుడు చాలా వ‌ర‌కు విషం లేని స‌ర్పాలు క‌నిపిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. పాము కాటుకు సంబంధించిన వైద్య చికిత్స స‌న్నిధానం, పంపా వ‌ద్ద అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, శబరిమల యాత్రలో భక్తులు, యాత్రికులు నడవడానికి ఉపయోగించే ప్రధాన మార్గాలు, రహదారులపై సూచిక బోర్డులను అనుసరించాలని చెబుతున్నారు. చీకటిగా ఉన్నప్పుడు, తగినంత వెలుతురు లేని ప్రదేశాలలో నడుస్తున్నప్పుడు టార్చ్‌లను ఉపయోగించాలని చెబుతున్నారు. ఎక్కడైనా పాములు ఎదురుపడినా, కనిపించినా దానిని పట్టుకోవటానికి, దానికి హాని కలిగించడానికి ప్రయత్నించవద్దు. వీలైనంత దూరం పాటించండి. సమీపంలోని అధికారికి తెలియజేయాలంటూ సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..