Dust Allergy: డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!

ఇలాంటి అలెర్జీల నుండి ఉపశమనం పొందడానికి మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ సమస్యను నియంత్రించడానికి కొన్ని సహజమైన ఇంటి నివారణలు కూడా ఉన్నాయి. ఈ నివారణలు అలెర్జీ లక్షణాల నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా, అవి శారీరక వ్యవస్థను బలపరుస్తాయి. అలాంటి కొన్ని ఇంటి చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Dust Allergy: డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
Dust Allergy
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 24, 2024 | 7:11 AM

డస్ట్ అలర్జీ అనేది ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా ఉబ్బసం,శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.. ఈ అలెర్జీల లక్షణాలు ముక్కు కారడం, తుమ్ములు, కంటి చికాకు, గొంతు బిగుతుగా మారటం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటి అలెర్జీల నుండి ఉపశమనం పొందడానికి మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ సమస్యను నియంత్రించడానికి కొన్ని సహజమైన ఇంటి నివారణలు కూడా ఉన్నాయి. ఈ నివారణలు అలెర్జీ లక్షణాల నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా, అవి శారీరక వ్యవస్థను బలపరుస్తాయి. అలాంటి కొన్ని ఇంటి చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

రాళ్ల ఉప్పు నివారణ:

రాళ్ల ఉప్పును గోరువెచ్చని నీటిలో కరిగించి ముక్కుతో పీల్చడం వల్ల అలర్జీల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ముక్కును క్లియర్ చేయడమే కాకుండా గొంతులో వాపును కూడా తగ్గిస్తుంది. చిన్న పాత్రలో వేడినీళ్లు, రాళ్ల ఉప్పు కలిపి ముక్కు రంద్రాల ద్వారా పీల్చుకోవాలి. ఇది మీ నాసికా భాగాల నుండి దుమ్ము, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అలెర్జీ లక్షణాల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

అల్లం, తేనెతో కలిపి తీసుకుంటే:

మీకు దుమ్ముతో అలర్జీ మరీ ఎక్కువగా ఉంటే తాజా అల్లం రసాన్ని ఒక చెంచా తేనెతో కలిపి తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తేనెతో కలిపిన అల్లం తింటే ఉపశమనం లభిస్తుంది. ఈ మిశ్రమం గొంతు మంటను తగ్గిస్తుంది. శరీరం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలెర్జీ లక్షణాలను నియంత్రిస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అలెర్జీల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.

తులసి, పసుపు :

తులసి, పసుపు రెండూ శారీరక కాలుష్యం, అలర్జీలకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేసే ఆయుర్వేద మందులు. తులసి ఆకులను నీళ్లలో వేసి మరిగించి అందులో పసుపు వేసి కషాయం తాగాలి. ఈ మిశ్రమం శరీరం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. వాపును తగ్గిస్తుంది. అలెర్జీల వల్ల కలిగే సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

కొబ్బరి నూనె మసాజ్:

కొబ్బరి నూనె చర్మానికే కాకుండా శ్వాసకోశ సమస్యలకు కూడా మేలు చేస్తుంది. డస్ట్ అలర్జీ వల్ల ముక్కు దిబ్బడ సమస్య ఎదురవుతున్నట్లయితే, రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను ముక్కు రంధ్రాల దగ్గర, గొంతుపై తేలికగా మసాజ్ చేయవచ్చు. ఇది శ్వాసలో ఉపశమనాన్ని అందిస్తుంది. వాపును తగ్గిస్తుంది.

సోంపు, జీలకర్ర నీరు:

సోపు, జీలకర్ర నీరు జీర్ణవ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండింటినీ మరిగించిన నీటిని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగడం వల్ల డస్ట్ అలర్జీ లక్షణాలు తగ్గుతాయి. ఈ మిశ్రమం శరీరం నుండి అదనపు కాలుష్యాలను బయటకు పంపుతుంది. తద్వారా అలర్జీల నుండి ఉపశమనం లభిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!