కొత్త శకం..! గిరిపుత్రులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇది కదా విజన్‌ అంటే..!

కొండల్లో, కోనల్లో బతికే గిరిజన ప్రజల కష్టాలు వర్ణనాతీతం. వారికి జీవన విధానం, మౌలిక సదుపాయాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కనీస ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి కూడా అగచాట్లు పడే గ్రామాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వాలు, పాలకులు ఎంతమంది మారుతున్నా మన్యంవాసులు, కొండ ప్రాంతాల ప్రజలు పడే కష్టాలకు మాత్రం పుల్‌స్టాప్ పడటం లేదు.. గిరిపుత్రుల కష్టాలు తీరడం లేదు. దశాబ్దాల అవస్థలకు చెక్ పెడుతూ ఇప్పటి సర్కార్‌ తీసుకున్న నిర్ణయం ఓ నవ శకానికి నాందికానుంది..

కొత్త శకం..! గిరిపుత్రులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇది కదా విజన్‌ అంటే..!
Container Hospitals
Follow us
G Koteswara Rao

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 23, 2024 | 1:06 PM

కొండ, కోనల్లో మగ్గుతూ వైద్య సేవలు సైతం అందక ప్రాణాలు కోల్పోతున్న గిరిశిఖర గిరి బిడ్డలకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. వైద్యం కోసం కిలోమీటర్లు కాలినడకన డోలిలో వెళ్లే పరిస్థితులకు చెక్ పెడుతూ మెరుగైన వైద్యం అందించే ఆసుపత్రినే నేరుగా గిరిజన కుటుంబాల ముంగిటకు తీసుకువచ్చింది. దశాబ్దాల అవస్థలకు చెక్ పెడుతూ వైద్య సేవల పై ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు గిరిజన కుటుంబాలు. ఇంతకీ డోలి మోతలకు చెక్ పెడుతూ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? గిరిజనులకు ఎంత మేర ప్రయోజనకరంగా ఉంటుంది..? అనుకుంటున్నారా..? అయితే, పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీలోని గిరిశిఖర ప్రాంతాల్లో నివాసముంటున్న గిరిజనుల సమస్యల పై ఏపి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దశాబ్దాలుగా కనీస మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, త్రాగునీరు సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతూ జీవనం సాగిస్తూ వస్తున్న గిరిజనుల సమస్యలకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో ప్రధానంగా వైద్య సదుపాయాల పై ముందడుగు వేసింది. ఇప్పటివరకు గిరిశిఖర గ్రామాల్లో ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య తలెత్తినా వైద్యసేవలకు డోలి మోతలు తప్పేవి కావు. వైద్య సేవల కోసం కిలోమీటర్ల కొద్దీ డోలిమోతతో కొండపై నుండి కిందకు దిగి మైదాన ప్రాంతంలో ఉన్న ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి.

ఇక గర్భిణీ మహిళల పరిస్థితి మరింత దయనీయం. పురిటి నొప్పులతోనే కుటుంబసభ్యుల సహకారంతో డోలిమోతలతో గంటల తరబడి ప్రయాణించి ఆసుపత్రికి చేర్చాల్సిన హృదయ విధార ఘటనలు నిత్యం కనిపిస్తుంటాయి. అనేకమంది గర్భిణీ మహిళలు, వృద్ధులు అనారోగ్యంతో గిరి శిఖర ప్రాంతం నుండి మైదాన ప్రాంతంకు డోలిలో ప్రయాణించే క్రమంలోనే సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నిత్యం గిరిజనులు ఎదుర్కొంటున్న ఈ కష్టాల పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు.

ఇవి కూడా చదవండి

గిరిశిఖర గ్రామం నుండి మైదాన ప్రాంతానికి రోడ్డు మార్గం లేని గ్రామాల్లోనే ఈ పరిస్థితి కనిపిస్తుంటుంది. గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేందుకు రోడ్డు వేయాలంటే అటవీ ప్రాంతం కావడంతో పర్యావరణ అనుమతులు అడ్డంకిగా మారేవి. దీంతో రహదారి సౌకర్యం ఏర్పాటుకు ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా గిరిశిఖర గ్రామాల్లోనే ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఒక కంటైనర్ ను గ్రామంలోనే ఏర్పాటు చేసి ఆ కంటైనర్ లోనే డాక్టర్స్ తో పాటు మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు, ప్రాథమిక చికిత్స, శస్త్ర చికిత్సలు సైతం చేసేలా ఏర్పాటు చేశారు. కంటైనర్ కూడా అధునాతన బిల్డింగ్ ను తలదన్నేలా అన్ని హంగులతో ఏర్పాటు చేశారు.

ఈ కంటైనర్ ఆస్పత్రి డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ను తలపిస్తుంది. డాక్టర్ గది, సిబ్బంది గదితో పాటు నాలుగు బెడ్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు రోగుల సౌకర్యం కోసం టివి, ఒక బాల్కనీ కూడా ఉంది. ఈ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసేందుకు అధునాతన సామగ్రిని కూడా అందుబాటులో ఉంచారు. ఈ ఆసుపత్రి ఏర్పాటుతో గిరి శిఖర గ్రామాల్లో గిరిజనులకు ఏ చిన్నపాటి ఆరోగ్య సమస్య తలెత్తినా క్షణాల్లో చికిత్స అందించే వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు క్రింద గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సొంత నియోజకవర్గంలోని సాలూరు మండలం కరడవలస గిరిశిఖర గ్రామంలో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ కంటైనర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ కంటైనర్ ఆసుపత్రికి గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం చేశారు.

ప్రస్తుతం ఏర్పాటు చేసిన కంటైనర్‌ ఆసుపత్రితో గిరిశిఖర గ్రామంలోని గిరిజన కష్టాలు తొలగాయనే చెప్పవచ్చు. కిలోమీటర్ల దూరం డోలితో వెళ్తున్న గిరిజనులకు ఇక పై అలాంటి పరిస్థితులు ఉండవనే చెప్పాలి. గిరి ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో లేని వైద్య సేవల కోసం రోగులను మైదాన ప్రాంతాలకు త్వరితగతిన తరలించేందుకు ఫీడర్ అంబులెన్స్ సైతం అందుబాటులోకి తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో గిరిశిఖర గ్రామాల్లో మరణాలు సంభవించకూడదనే ప్రధాన లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కంటైనర్ హస్పటల్ ప్రతిపాదనలతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?