AP Weather: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన
నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, తదుపరి 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏపీ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి....
నవంబర్ 23 వ తేదీ 2024 ఉదయము 08:30 గంటలకు తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం, ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం & ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, తూర్పు హిందూ మహాసముద్రం… దానిని ఆనుకుని వున్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై నవంబర్ 25న వాయుగుండముగా ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 2 రోజుల్లో తమిళనాడు-శ్రీలంక తీరాలు వైపు వెళ్లే అవకాశం ఉంది. అంతేగాక ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
శనివారం, ఆదివారం, సోమవారం :- వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది .
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ :-
శనివారం, ఆదివారం, సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
అయితే అల్పపీడనం ప్రభావంతో మంగళ, బుధవాాారాల్లో (26,27న) కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.