Vizag: అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
విశాఖ తీరంలో సముద్రం సయ్యాట ఆడుతోంది. అలలతో ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉండే సముద్రం ఉన్నట్లుండి 200 మీటర్లు వెనక్కి వెళ్లింది. నిత్యం అలలు ఎగసిపడి బీచ్ రోడ్డును తాకేవి. అలాంటిది అలల తాకిడి లేకపోగా సముద్రం వెనక్కి వెళ్లిపోవడంతో స్థానికులు ఆశ్చర్యంతో పాటు భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు సముద్రంలో ఇసుక కోత కూడా ఓ కారణమంటున్నారు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ చీఫ్ సైంటిస్ట్ VVSS శర్మ.
సముద్రంలో ఇలా మార్పులు వచ్చినప్పుడు సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. విశాఖ బీచ్‌లో మారుతున్న కెరటాల ఆటుపోట్లతో, సాధారణ సమయంలో కనిపించని దృశ్యాలు కనిపిస్తున్నాయి. సముద్రం వెనక్కి వెళ్లిపోవడంతో తీరంలో రాళ్లు తేలి కనిపిస్తున్నాయి. కార్తీక పౌర్ణమి తర్వాత మళ్లీ కెరటాలు వెనక్కి వెళ్ళినట్టు కనిపించాయి. ఆ తర్వాత రోజు కూడా అటువంటి దృశ్యాలే కనిపించాయి. ఇవి పర్యాటకులను తెగ ఆకర్షిస్తున్నాయి. బీచ్‌కు వచ్చిన టూరిస్టులు, సరదాగా ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. గతంలోనూ ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ.. వెనక్కు వెళ్లిన సముద్రం మళ్ళీ సాధారణంగా మారింది. పున్నమికి, అమావాస్యకు ఇలా జరగడం సహజమే అంటున్నారు స్థానిక మత్స్యకారులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

